Top
logo

బీజేపీ పై విమర్శలు చేసిన కేటీఆర్

బీజేపీ పై విమర్శలు చేసిన కేటీఆర్
X
Highlights

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణాలో అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకొని పార్టీని రాష్ట్రంలో బలోపేతం...

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణాలో అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకొని పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయాలనీ ప్రయత్నాలు చేస్తుంది బీజేపి . ఈ తరుణంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపేనని పలుమార్లు అ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు.. ఈ నేపధ్యంలో టీఆర్ఎస్ కూడా దీనికి దీటుగా సమాధానం ఇచ్చేందుకు సిద్దం అయింది . టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపిపై విమర్శలకి దిగారు.. బీజేపిపైన పరోక్షంగానే విమర్శలకు దిగిన కేటీఆర్ "కొందరు తమతో ఉంటే దేశభక్తులు లేకపోతే దేశద్రోహులు అనేలా వ్యవహరిస్తున్నారని వాఖ్యనిచారు.. తెలంగాణ వికాస సమితి మహాసభల ప్రారంభోత్సవంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో మహాత్మా గాంధీపై ఎంపీ సాథ్వీ ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలను కేటీఆర్ గుర్తు చేసుకుంటూ గాంధీని చంపిన వాళ్లను దేశభక్తులుగా అభివర్ణించిన సాథ్వీ ప్రజ్ఞాసింగ్‌ను కొందరు సమర్థించడం నిజంగా ఆశ్చర్యంగా ఉందని అన్నారు ..

Next Story