మైకెల్ జాక్సన్ స్టెప్పులతో అదరగొట్టిన మెట్రో కార్మికుడు

మైకెల్ జాక్సన్ స్టెప్పులతో అదరగొట్టిన మెట్రో కార్మికుడు
x
Highlights

సోషల్ మీడియా పుణ్యమా అని ఇటీవల చిన్న చిన్న ఉద్యోగులు, కార్మికుల్లో ఉన్న అపారమైన నైపుణ్యం బయట ప్రపంచానికి తెలుస్తోంది, ఈ తరహాలో ఎంతో మంది సామాన్యులు...

సోషల్ మీడియా పుణ్యమా అని ఇటీవల చిన్న చిన్న ఉద్యోగులు, కార్మికుల్లో ఉన్న అపారమైన నైపుణ్యం బయట ప్రపంచానికి తెలుస్తోంది, ఈ తరహాలో ఎంతో మంది సామాన్యులు పాపులర్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి, తాజాగా హైదరాబాద్‌లో ఓ మెట్రో కార్మికుడు డ్యాన్స్ వీడియో వైరల్ అయ్యింది, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో కొన్ని వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అలాంటి వారిలో ఓ నిర్మాణ కార్మికుడు లంచ్ బ్రేక్‌లో తన తోటి వర్కర్ల ముందు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు.

ఈ డాన్స్ చూసి చాలా మంది షాక్ అవుతున్నారు అంత అద్భుతంగా ఉంది అతడి ఫర్ఫామెన్స్, కార్మికుడు మైకేల్ జాక్సన్ స్టెప్పుల్ని దించేశాడు. ఓ కర్రతో ఎంతో ఈజీగా అతను ఆ స్టెప్పులు వెయ్యడం చూస్తే, అతను మూవీ ఆర్టిస్టేమో అన్న డౌట్ వస్తుంది, తమ ప్రాజెక్టులో ఇలాంటి టాలెంటెడ్ వర్కర్లు ఉండటంపై ఎంతో సంతోషిస్తున్నామని మెట్రో రైల్ ఎండీ ట్వీట్ చేశారు. ఇలాంటి వారిని చూసి గర్వపడుతు న్నామన్నారు. ఇంకా సదరు వ్యక్తి డ్యాన్స్ వీడియోను కూడా పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూపర్ టాలెంట్ అని ప్రశంసిస్తూ రీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూస్తే మీరు కూడా నిజంగా మైకేల్ జాక్సన్ దిగివచ్చాడు అనడం మాత్రం గ్యారంటీ.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories