టీఆర్ఎస్ రాష్ర్టంలో అద్భుతాన్ని సృష్టించింది: మంత్రి కేటీఆర్

టీఆర్ఎస్ రాష్ర్టంలో అద్భుతాన్ని సృష్టించింది: మంత్రి కేటీఆర్
x
Highlights

తెలంగాణ రాష్ర్టంలో ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్పర్సన్లు, మేయర్లు నేడు తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.

తెలంగాణ రాష్ర్టంలో ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్పర్సన్లు, మేయర్లు నేడు తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ ని మర్యదాపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఎన్నికలోనూ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుందని ఆయన అన్నారు.

మున్సిపల్ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు ఎంతో ప్రయత్నించాయని అయినప్పటికీ అయినప్పటికీ ఎన్నికలను ఆపలేకపోయాయని అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి మొత్తం 8 వేల మంది అబ్యర్థులు నామినేషన్లు వేశారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలనుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుని ఇంట్లో కూర్చోవడం మంచిదని ఆయన హితవు పలికారు. కొంత మంద నాయకులు టీఆర్ఎస్ విజయాన్ని అపహాస్యం చేసారని, అది ఓట్లేసిన ప్రజలను అవమానపరచడమేనని తెలిపారు. ఇకపోతే రాజకీయాల్లో ప్రత్యామ్నాయం తానే అనే ఎగిరి పడిన బీజేపీ పూర్తిస్థాయిలో అభ్యర్థులను బరిలోకి దింపలేకపోయిందన్నారు.

2014లో నిర్వహించిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం 63 సీట్లను సాధించి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పటిన తరువాత సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను చేపట్టిందని తెలిపారు. దీంతో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపారని, 2018 ఎన్నికల్లో చంద్రబాబు, రాహు ల్ ఒక్కటైనప్పటికీ 75 శాతం సీట్లను టీఆర్ఎస్ సాధించిందన్నారు. వాటితో పాటుగానే పంచాయతీ, జడ్పీ మండల ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించామని తెలిపారు. మున్సిపల్ఎన్నికల్లో 130 సీట్లకు 122 సీట్లు సాధించడం అంటే మాటలు కాదన్నారు. ఇక ఇదే నేపథ్యంలో జడ్పీ ఎన్నికల్లో కూడా నూటికి నూరు శాతం సీట్లు సాధించిన ఘనత కేవలం టీఆర్ఎస్ కే దక్కిందని తెలిపారు. ఇక మీదట మున్సిపాలిటీలకు ప్రతి ఏడాది రూ.3 వేల కోట్ల నిధులను మంజూరు చేస్తామని దీంతో పట్టణాలను శరవేగంగా అభివృద్ది చేయవచ్చని ఆయన తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories