హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా ప్రకటించాలనే ఆశ ఉంది: కేటీఆర్

హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా ప్రకటించాలనే ఆశ ఉంది: కేటీఆర్
x
కేటీఆర్ (ఫైల్ ఫోటో)
Highlights

ఎంతో ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలో జరుగుతున్న టైమ్స్ నౌ సమ్మిట్ లో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలో జరుగుతున్న టైమ్స్ నౌ సమ్మిట్ లో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ను అడిగిన ఒక ప్రశ్నకు గాను ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ప్రపంచం అంతా హైదరాబాద్ వైపు చూస్తోందనీ, అందులో ఢిల్లీ కూడా ఉందని ఆయన అన్నారు. దేశంలో ఎంతో అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ ను ప్రపంచం చూడటం ఎంతో గర్వంగా ఉందని అన్నారు.

హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా తెలంగాణ ప్రజలు ఒప్పుకోరని, ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఒప్పుకుంటారని తాను అనుకోవట్లేదని కేటీఆర్ అభిప్రాయ పడ్డారు. కానీ తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ఎంతో అబివృద్ది చెందుతున్న హైదరాబాద్ ను దేశ రెండో రాజధానిగా చెయ్యాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్న ఆయన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెర తీశాయి. గత ఐదేళ్లలో హైదరాబాద్ ఎంతగానో అభివృద్ధి చెందిందని ఆయన తెలిపారు. ఉత్తమ నివాస యోగ్యమైన నగరంగా పలు సర్వేల్లో హైదరాబాద్ ను ఎన్నుకున్నారని, అందుకుగాను ఎన్నో అవార్డులను నగరం అందుకుందని గుర్తుచేశారు.

దేశ రాజధాని అయిన ఢిల్లీ దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు ఎంతో దూరంగా ఉందని ఆయన అన్నారు. దీంతో ఎన్నో అంశాల్లో దక్షిణాది రాష్ట్రాలకు ఢిల్లీ పాలకులు సరైన న్యాయం చెయ్యట్లేదని ఆయన భవాన్ని వ్యక్తీకరించారు. కాలుష్యం విషయంలో ఢిల్లీ కంటే కూడా హైదరాబాద్ ఎంతో బెటర్ గా ఉందని చెప్పారు. వాతావరణ పరంగా కూడా హైదరాబాద్ కొంత చల్లదనంతో ఆకట్టుకుంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రపతి కూడా శీతాకాల విడిది కోసం ప్రతి ఏటా హైదరాబాద్‌కి వస్తుంటారు. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా ప్రకటించాలనే అభిప్రాయం, డిమాండ్, ఆశలు ఉన్నాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories