మృగాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న ఫ్లెక్సీ

మృగాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న ఫ్లెక్సీ
x
Highlights

మైనర్లపై అత్యాచారాలు నిరోధించేందుకు కొత్తగూడెం పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. కామాంధుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే ప్రయత్నం చేస్తున్నారు....

మైనర్లపై అత్యాచారాలు నిరోధించేందుకు కొత్తగూడెం పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. కామాంధుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. మైనర్లను చిదిమేసే మృగాళ్లకు ఫోక్సో చట్టంలో మరణశిక్ష వుందని గుర్తు చేస్తున్నారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని టు టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఈ ఫ్లెక్సీ. కామాంధులకే మరణే శిక్షే అంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తుంది.

దేశంలో నెలల చిన్నారుల మొదలుకొని మైనర్లపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిర్భయ, ఫోక్సో చట్టాలు తెచ్చిన కామాంధుల ఆగడాలను అరికట్టలేకపోతున్నాయి. ఏళ్ల పాటు విచారణ కొనపాగి నిందితులకు జీవిత ఖైదు శిక్ష మాత్రమే పడుతుంది. మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలపై మహిళా సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కామాంధులకు మరణేశిక్షే సరైన శిక్ష అని చెబుతున్నాయి. కొత్తగూడెం పోలీసుల చొరవను అభినదిస్తూ ఈ తరహా దేశవ్యాప్తంగా బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

మైనర్లపై అత్యాచారాలు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం ఫోక్స్ చట్టంలో మార్పులు తెచ్చిందని, 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణశిక్ష వేయవచ్చు అంటున్నారు పోలీసు అధికారులు. ఈ విషయంపై అందరీ అవగాహన కోసం కొత్తగూడెం పోలీస్ స్టేషన్ ఎదుట కామాంధులకే మరణే శిక్షే అనే బోర్డు పెట్టడం జరిగిందని చెబుతున్నారు. మైనర్లపై అత్యాచారాలు నిరోధించేందుకు కొత్తగూడెం చేసిన పోలీసులు చేస్తున్న ప్రయత్నాని స్థానికులు అభినందిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories