కొండపోచమ్మ రిజర్వాయర్ రెడీ..ప్రారంభానికి సర్వం సిద్దం

కొండపోచమ్మ రిజర్వాయర్ రెడీ..ప్రారంభానికి సర్వం సిద్దం
x
Highlights

భగీరధుడు ఆకాశం నుంచి గంగను కిందికి దించితే, అపర భగీరధుడు కేసీఆర్ గోదావరి జలాలను కింది లోతట్టు ప్రాంతాల నుంచి ఎత్తులో ఉన్న ప్రాంతాలకు నీటిని తీసుకెళ్లి రైతుల సాగునీటి కష్టాలను తీర్చాడు.

భగీరధుడు ఆకాశం నుంచి గంగను కిందికి దించితే, అపర భగీరధుడు కేసీఆర్ గోదావరి జలాలను కింది లోతట్టు ప్రాంతాల నుంచి ఎత్తులో ఉన్న ప్రాంతాలకు నీటిని తీసుకెళ్లి రైతుల సాగునీటి కష్టాలను తీర్చాడు. గోదావరి జలాలను అరకిలో మీటరు ఎత్తుకు తీసుకెళ్లి లక్షలాది ఎకరాలను తడపాలన్న కల సాకారమయ్యే క్షణం సమీపించింది. కొండ పోచమ్మ జలాశయం ప్రారంభానికి సర్వం సిద్దం అయింది. సముద్ర మట్టానికి 510 మీటర్ల ఎత్తులో దాదాపు రూ.1,600 కోట్ల వ్యయంతో కొండ పోచమ్మ ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింక్ 4, ప్యాకేజీ 14లో భాగంగా చేపట్టారు. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు యాదాద్రి భువనగిరి, మేడ్చల్ జిల్లాలకు సాగు నీరందనుంది. ఈ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గం పరిధిలోని సుమారు 26 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. అంతే కాదు హైదరాబాద్ నగరానికి తాగునీటి సౌకర్యంతో పాటు ఐదు జిల్లాల పరిధిలోని 2.85 లక్షల ఎకరాలకు సాగునీటిని అందనుంది.

ఎనిమిది ప్రధాన కాల్వలు..

ఈ రోజు ప్రారంభం కానున్న కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ వలయాకారంలో 8 కిలో మీటర్ల మేర నిర్మించారు. ఐదు జిల్లాల పరిధిలోని గజ్వేల్, నర్సాపూర్, మెదక్, సంగారెడ్డి, దుబ్బాక, భువనగిరి, పటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చెరు, మల్కాజిగిరి నియోజకవర్గాల్లోని 26 మండలాల్లోని గ్రామాలకు ఎనిమిది ప్రధాన కాల్వల (135 కిలో మీటర్లు) ద్వారా గోదావరి జలాలను మళ్లించనున్నారు. అంతే కాకుండా నీటిని పంపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేలా మూడు పాయింట్ల వద్ద పంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేశారు. దీని కోసం ఇప్పటికే రామాయంపేట, గజ్వేల్, కిష్టాపూర్, శంకరంపేట, ఉప్పరపల్లి, జగదేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్, తుర్కపల్లి, ఎం తుర్కపల్లి కాల్వలను పూర్తిచేసారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో నీటి మళ్లింపు..

నిజానికి కొండపోచమ్మ రిజర్వాయర్ కు రంగనాయక సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కొమురవెల్లి మల్లన్నసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నీటిని తరలించాలి. అక్కడ రిజర్వాయర్ లో నీటి మట్టం పెరిగిన తరువాత అక్కడి నుంచి 21.335 కిలో మీటర్ల గ్రావిటీ కెనాల్స్ తో నీటిని మళ్లించాల్సింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మల్లన్న సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్ పనులు అసంపూర్తి కావడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో నీటి తరలించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. రంగనాయక సాగర్ నుంచి టన్నెల్ ద్వారా తొగుట మండలం తుక్కాపూర్ వద్ద నిర్మించిన సర్జిపూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గోదావరి నీటిని విడుదల చేసారు. అక్కడి నుంచి నీటిని మల్లన్న సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్ అక్కడి నుంచి గజ్వేల్ మండలం అక్కారంలో నిర్మించిన పంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి విడుదల చేస్తారు. అక్కడి నుంచి మర్కుక్ లో నిర్మించిన పంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నీటిని తరలించి కొండపొచమ్మ సాగర్ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఎత్తి పోయనున్నారు.

సీఎం చేతుల మీదుగా..

కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవానికి ముందు సీఎం కేసీఆర్ దంపతులు కొండపోచమ్మ ఆలయంలో నిర్వహించిన చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఉదయం 4:30 గంటల సమయానికి స్థానిక సర్పంచ్‌ రజిత - రమేశ్‌, ఆలయ చైర్మన్‌ ఉపేందర్‌ రెడ్డి చండీహోమం నిర్వహించారు. అందులో భాగంగానే హోమంలో చివరి ఘట్టమైన పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం సీఎం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి బయల్దేరి వెళ్లారు. సీఎం సొంత ఖర్చులతో నిర్మించనున్న ఎర్రవల్లి రైతు వేదికకు ఉదయం 9: 35 గంటలకు భూమిపూజ చేసారు. మర్కుక్ లో రైతు వేదికకు 9: 45 గంటలకు భూమి పూజ చేసారు. మర్కూర్‌ పంప్‌హౌస్‌ వద్ద నిర్వహించే సుదర్శనయాగం పూర్ణాహుతిలో కేసీఆర్‌ దంపతులు, త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామీ ఉదయం 10 గంటల సమయంలో పాల్గొంటారు. మర్కూక్‌ పంప్‌హౌస్‌ను ఉదయం 11:30 గంటలకు ప్రారంభిస్తారు. కొండపోచమ్మ జలాశయం వద్ద గోదావరి జలాలకు ఉదయం 11:35 గంటలకు హారతి ఇస్తారు. మర్కూక్‌ మండల కేంద్రంలోని వరదరాజస్వామి దేవాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు సీఎం పూజలు నిర్వహిస్తారు.ప్రజాప్రతినిధులు, అధికారులతో మధ్యాహ్నం 1:30 గంటలకు సీఎం సమావేశం నిర్వహిస్తారు.

కొండ పోచమ్మ రిజర్వాయర్ వివరాలు:

♦ సేకరించిన భూమి 4,636 ఎకరాలు

♦ ముంపునకు గురయ్యే అటవీ భూమి 135.64 ఎకరాలు

♦ సాగు విస్తీర్ణం 2.85 లక్షల ఎకరాలు

♦ సామర్థ్యం 15 టీఎంసీలు

♦ అంచనా వ్యయం రూ.1,600 కోట్లు

♦ ప్రయోజనం పొందనున్న జిల్లాలు 5

♦ ఫుల్ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవల్ 618.0 మీటర్లు

♦ కట్ట పొడవు 15.80 కిలో మీటర్లు

♦ కట్ట గరిష్ఠ ఎత్తు 300 అడుగులు

♦ కట్ట వెడల్పు 100 అడుగులు

ముంపునకు గురవుతున్న గ్రామాలు (మామిడాల, బైలంపూర్, తానేదార్పల్లి)


హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories