ఎన్నికల నిర్వహణపై విచారణకు డిమాండ్ : కోదండరామ్

ఎన్నికల నిర్వహణపై విచారణకు డిమాండ్ : కోదండరామ్
x
Highlights

టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఎన్నికల కమిషన్ పై ఆరోపణలు గుప్పించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అన్నారు. ఎన్నికల...

టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఎన్నికల కమిషన్ పై ఆరోపణలు గుప్పించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అన్నారు. ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ ఆస్తులపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల నిర్వహణ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఇక పొత్తుల్లో భాగంగా ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా అన్న ప్రశ్నకి సమాధానంగా.. ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలనే ఆసక్తి తనకు లేదన్నారు.

పంచాయితీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూటమిలో కొనసాగాల వాద్దా అనేది కాంగ్రెస్ నిర్ణయాన్ని బట్టే ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసినా చెయ్యకపోయినా.. మంచి అభ్యర్థులకే తమ మద్దతు ఉంటుందని కోదండరామ్ అన్నారు. భూమి పట్టాలు, పోడు భూములపై పంచాయితీ ఎన్నికల తర్వాత పోరాటాలు ఉధృతం చేస్తామన్నారాయన.

Show Full Article
Print Article
Next Story
More Stories