దత్తన్నఇంట్లో కత్తి కలకలం..

దత్తన్నఇంట్లో కత్తి కలకలం..
x
Highlights

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత, కాబోయే హిమచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఇంట్లో కత్తి కనిపించడం కలకలం రేపింది. గవర్నర్‌గా ఎన్నికైనా దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలియజేయడాని రాంనగర్‌లోని ఆయనకు ఇంటికి నేతలు, అభిమానులు తరలి వస్తున్నారు.

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత, కాబోయే హిమచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఇంట్లో కత్తి కనిపించడం కలకలం రేపింది. గవర్నర్‌గా ఎన్నికైనా దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలియజేయడాని రాంనగర్‌లోని ఆయనకు ఇంటికి నేతలు, అభిమానులు తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం దత్తాత్రేయతో ఫొటోలు దిగేందుకు నేతలు క్యూకట్టారు. ఇదే సమయంలో తోపులాట చోటుచేసుకోవడంతో ఈ క్రమంలో అక్కడ చిన్నపాటి కత్తి(పెన్సిల్ కట్టర్) పడిపోయింది. కత్తిని గుర్తించిన కార్యకర్తలు దాన్ని దత్తాత్రేయ వ్యక్తిగత సిబ్బందికి అందజేశారు. ఆయనపై ఏదైనా దాడికి కుట్ర జరిగిందేమోనని అభిమానులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో దత్తాత్రేయ నివాసంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories