Hyderabad: కిరోసిన్ తో నడిచే ఫ్యాన్ చూసారా..?

Hyderabad: కిరోసిన్ తో నడిచే ఫ్యాన్ చూసారా..?
x
Highlights

పాత కాలంలో కిరోసిన్ తో వెలిగే దీపాలను అందరూ చూసే ఉంటాం. అదేవిధంగా నిజాం కాలంలో కిరోసిన్ తో నడిచే ఫ్యాన్ లు కూడా ఉండేవి.

పాత కాలంలో కిరోసిన్ తో వెలిగే దీపాలను అందరూ చూసే ఉంటాం. అదేవిధంగా నిజాం కాలంలో కిరోసిన్ తో నడిచే ఫ్యాన్ లు కూడా ఉండేవి. దాంతో పాటుగానే నిజాం కాలంలో వినియోగించే ఫ్యాన్లు, విద్యుత్తు పరికరాలు, వాహనాలు, షాండిలియర్స్, రిఫ్రీజిరేటర్లు ఇతర వస్తువులను వివిధ దేశాల నుంచి అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసి నగరానికి తీసుకొచ్చేవారు. అదే కోణంలో కిరోసిన్ తో తిరిగే ఫ్యాణ్ కూడా నగరానికి వచ్చింది. కానీ కాలం మారినా కొలది, టెక్నాలజీ పెరిగిన కొలది పాత వస్తువుల ఉనికి తగ్గిపోతుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా వీటిని చూడొచ్చు. ఇంకా కొంత మంది వాటిని ఉపయోగించడం చూడొచ్చు.

నిజాం కాలం నాటి పురాతనమైన ఫ్యాన్లు హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో అక్కడక్కడా దర్శనమిస్తాయి. ఈ ఫ్యాన్ ఇంగ్లండ్‌ దేశంలో తయారు చేసింది. ఈ ఫ్యాన్ ను కనుగొన్న మొదటి రోజుల్లో విద్యుత్‌తో కాకుండా వేడితో తిరిగేలా చేసేవారు. అంతే కాదు ఈ ఫ్యాన్ పాడయితే దాన్ని రిపేరు చేసే వారు కూడా ఉండేవారు. వారు ఇప్పటికి కూడా పాత బస్తీలో ఉన్నారు. పాతబస్తీలోని పురానీహవేలీ నివాసి మహ్మద్‌ హనీఫ్‌ ఇల్యాస్‌ బాబా ఇంట్లో ఈ కిరోసిన్‌ ఫ్యాన్‌ను ఇప్పటికీ వాడుతున్నారు.

ఇక పోతే ఈ కిరోసిన్ ఫ్యాన్లను 1980 వరకు పాతబస్తీలోని ఎక్కువగా వినియోగించే వారు. ఈ ఫ్యాన్ ను 1800లో ఇంగ్లాండ్‌లో కనుగొన్నారు. దీని రూపకల్పనలో నీరు, సల్ఫ్యూరిక్‌ ఆమ్లం ఉపయోగించారు. ఈ ఫ్యాన్ ను కిరోసిన్ తో నుడుస్తుంది. ఈ ఫ్యాన్ నడవాలంటే అందులో కిరోసిన్ పోసి దీపం వెలిగించాలి. అప్పుడు దీపం నుంచి పైపుల ద్వారా వేడి పైకి వెళుతుంది. పైకి వేడితో పాటు గ్యాస్‌ ప్రవేశించి ఆ ఆవిరితో ఫ్యాన్‌ తిరగడం ప్రారంభమవుతుంది. అది ఎంత వేడి ఎక్కితే అంత వేగంగా రెక్కలు తిరుగుతాయి. కానీ ఇప్పుడు టెక్నాలజి పెరిగిన తరువాత విద్యుత్తుతో నడిచే ఫ్యాన్లు మార్కెట్‌లో వచ్చాక వాటిని పక్కన పెట్టి విద్యుత్ ఫ్యాన్లను వినియోగించడం మొదలు పెట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories