ఫోన్‌ చేస్తే చాలు.. వీధిలోకి ఏటీఎం !

ఫోన్‌ చేస్తే చాలు.. వీధిలోకి ఏటీఎం !
x
Highlights

కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ప్రజలంతా ఇంటికే పరిమితమైన వేళ, బ్యాంకులో డబ్బులున్నా, చేతిలో డబ్బుల్లేకుండా...

కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ప్రజలంతా ఇంటికే పరిమితమైన వేళ, బ్యాంకులో డబ్బులున్నా, చేతిలో డబ్బుల్లేకుండా ఇబ్బందులు పడుతున్న వారి కోసం కేడీసీసీ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల సౌలభ్యం కోసం గ్రామాల్లో మొబైల్‌ ఏటీఎంలను ఏర్పాటు చేసినట్లు కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ యార్లగడ్డ వెంకట్రావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

డబ్బులు కావాలని భావించే వారు ఆయా గ్రామాల్లోని సహకార సంఘం కార్యదర్శికి సమాచారం ఇవ్వాలని ఆ వెంటనే ఆయా వీధుల్లోకి మొబైల్ ఏటీఎంలను పంపిస్తామని వెల్లడించారు. విజయవాడ, నూజివీడు డివిజన్లకు సంబంధించి 99496 88340, గుడివాడ, మచిలీపట్నం డివిజన్లకు సంబంధించి 99496 88362కు ఫోన్‌ చేసి సమాచారం అందించిన వెంటనే మొబైల్‌ ఏటీఎంలను పంపిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories