logo

కొత్త చట్టాలపై కలెక్టర్లతో చర్చించిన సీఎం కేసీఆర్

కొత్త చట్టాలపై కలెక్టర్లతో చర్చించిన సీఎం కేసీఆర్
Highlights

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటవీ భూముల్లో అడవుల పునరుద్ధరణకు ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ జిల్లా కలెక్టర్లకు సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటవీ భూముల్లో అడవుల పునరుద్ధరణకు ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ జిల్లా కలెక్టర్లకు సూచించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులను కలెక్టర్లకు ముఖ్యమంత్రి స్వయంగా చూపించారు. కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టం అమలుపైన, కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపైన కలెక్టర్లతో సీఎం చర్చించారు.అడువుల వల్ల ఉపయోగం.. వాటిని ఎలా కాపాడుకోవాలి.. అటవీ పునరుద్ధరణ పనులను సీఎం కేసీఆర్ కలెక్టర్లకు స్వయంగా చూపించారు. గజ్వేల్ నియోజవర్గంలో పనులను క్షేత్రస్థాయిలో కలెక్టర్లకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీ భూముల్లో అడవుల పునరుద్ధరణకు ప్రణాళిక రూపొందించి, కార్యాచరణ ప్రారంభించాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని అటవీ భూములు ఎడారుల్లా ఉండేవని కేసీఆర్ అన్నారు. అటవీ భూముల్లో అడవిని పునరుద్ధరించాలనే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేసినట్లు తెలిపారు. మూడేళ్ల క్రితం ప్రారంభమైన పునరుద్ధరణ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయన్నారు. ఈ ప్రాంతమంతా పచ్చని చెట్లతో కళకళలాడుతున్నదని, వర్షపాతం కూడా పెరిగిందన్నారు సిఎం.

పర్యాటనలో భాగంగా జిల్లా కలెక్టర్లు, మంత్రులతో కేసీఆర్ రెండు రోజు సమావేశం నిర్వహించారు. ఉన్న అడవులను కాపాడుకోవాలని అందులో మొక్కలు నాటి అడవిని పునరుద్ధరించాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఈ బాధ్యత తీసుకోవాలని సూచించారు. అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని సందర్శించిన అనంతరం కలెక్టర్లు కోమటిబండలో నిర్మించిన మిషన్ భగీరథ ప్లాంటును సందర్శించారు. అక్కడే కలెక్టర్లతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం కలెక్టర్లతో సమావేశమయ్యారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం అమలుపైన, కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపైన కలెక్టర్లతో సీఎం చర్చించారు. పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని దీనికి అనుగుణంగా 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కోరారు.



లైవ్ టీవి


Share it
Top