కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కేసీఆర్ విగ్రహం

కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కేసీఆర్ విగ్రహం
x
Highlights

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ పట్టుదలతోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిందని ఆయన క్యాంస విగ్రహం తయారు...

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ పట్టుదలతోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిందని ఆయన క్యాంస విగ్రహం తయారు చేయించారు స్థానిక టీఆర్ ఎస్ నాయకులు. కాళేశ్వరం ప్రాజెక్ట్ శంకుస్థాపన రోజే కేసీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అనుకున్నారు, కానీ ప్రాజెక్ట్ పూర్తి అయ్యాక విగ్రహం పెడితే బాగుంటుందని కొందరు సీనియర్ నేతలు సూచించడంతో దాన్ని విరమంచుకున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ సమీపంలోని అంబటిపల్లి లోని ఓ టీఆర్ ఎస్ నాయకుడు ఇంట్లో కేసీఆర్ విగ్రహాన్ని తీసుకెళ్లి భద్రపరించారు.

ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో అంబటిపల్లిలో టీఆర్ ఎస్ నాయకుడి ఇంట్లోనున్న కేసీఆర్ విగ్రహాన్ని ఆ పార్టీ నాయకులు బయటకు తీశారు. మేడిగడ్డ బ్యారేజ్ వెళ్లే రూట్ లో కేసీఆర్ విగ్రహాన్ని ఆవిష‌్కరించేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories