ఈ ఒక్కరోజే తెలంగాణలో 10 కేసులు..రాష్ట్రంలో 59 మందికి కరోనా పాజిటివ్‌: సీఎం కేసీఆర్‌

ఈ ఒక్కరోజే తెలంగాణలో 10 కేసులు..రాష్ట్రంలో 59 మందికి కరోనా పాజిటివ్‌: సీఎం కేసీఆర్‌
x
Highlights

కరోనా వైరస్ ప్రభావంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 59 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సీఎం...

కరోనా వైరస్ ప్రభావంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 59 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వీరిలో ఒకరు కోలుకొని డిశ్చార్జి కాగా.. 58 మందికి చికిత్స జరుగుతోందని వెల్లడించారు. మరో 20వేల మంది ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నారు. వీళ్ల గురించి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం. ఈ రోజు ఒక్క రోజే 10 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ప్రజలకు ధన్యవాదాలు. మంచి సహకారం అందిస్తున్నారు. ఇది కూడా మనం చేయలేకపోతే పరిస్థితి ఇంకా భయంకరంగా ఉండేది అని వివరించారు.

ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనాకు మందు లేదని పేర్కొన్నారు. వ్యాప్తిని నిరోధించడమే కరోనాకు పెద్ద మందు అని వ్యాఖ్యానించారు. స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అని హెచ్చరించారు. ఇళ్లలోంచి బయటికి రావొద్దని, ఏమౌతుందిలే అనే నిర్లక్ష్యం పనికిరాదని కేసీఆర్‌ హెచ్చరించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories