శవాల మీద పేలాలు ఏరుకోకండి: సీఎం కేసీఆర్

శవాల మీద పేలాలు ఏరుకోకండి: సీఎం కేసీఆర్
x
KCR Speech In Assembly
Highlights

లంగాణ రాష్ట్రంలో శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కరోనా వైరస్ గురించి వాడి వేడిగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ కరోనా వైరస్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కరోనా వైరస్ గురించి వాడి వేడిగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ కరోనా వైరస్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో బట్టి విక్రమార్క ఆ సమావేశంలో మాట్లాడుతూ కరోనా లాంటి సున్నితమైన అంశంపై రాజకీయం చేయడం తగదని ఆయన హితవు పలికారు. విదేశీయులు కరోనా వైరస్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగానే వైరస్ వ్యాపిస్తుందని అన్నారు.

కేంద్రం రింగ్ టోన్ పెట్టి వదిలేసింది కానీ సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని తెలిపారు. మొన్నటికి మొన్న సీఎం కేసీఆర్ కరోనా వస్తే కేవలం ఒక పారాసిట్‌మాల్‌ ట్యాబ్‌లెట్ వేసుకుంటే తగ్గిపోతుందని చెప్పారని భట్టి ఎద్దేవా చేశారు. అలాంటపుడు దుబాయ్ నుంచి వచ్చిన కర్ణాటక వాసి హుస్సేన్ సిద్ధిఖీని ఎందుకు బతికించలేదని, హైదరాబాద్‌లో అన్ని ఆస్పత్రుల్లో చికిత్స పొందిన తర్వాత కూడా ఎలా చనిపోయాడని భట్టి ప్రశ్నించారు. 27 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే కరోనా వైరస్ చనిపోతుందన్నారని, రాష్ట్రంలో అంతకన్నా ఎక్కువ ఎండ ఉందని మొన్నటి సమావేశంలో సీఎం చెప్పారని గుర్తు చేశారు.

దీంతో స్పందించిన సీఎం కేసీఆర్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యలనై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రతి పక్షనేతలు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కరోనా వైరస్ ని రాజకీయం చేయకూడదని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ నియంత్రణ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. ప్రజలకు కరోనా వైరస్ పైన ఉన్న భయం పొగొట్టి వారికి ధైర్యం చెప్పాలని అలా చెప్పానన్నారు.

పారాసిట్‌మాల్‌ వేసుకుంటే జ్వరం తగ్గుతుందని ఒక సైంటిస్ట్‌ తనతో చెప్పారని గుర్తు చేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజలకు భయాందోళనకు గురిచేయొద్దని తెలిపారు. శవాల మీద పేలాలు ఏరుకున్నట్లుగా ప్రవర్తించవద్దని హితవుపలికారు. ప్రజలను ధైర్యం చెప్పి వాల్లని అప్రమత్తం చేయాలి కానీ గందరగోళానికి గురిచేయడం సరికాదని అన్నారు. తమ బాధ్యతను వంద శాతం చిత్తశుద్ధితో నిర్వహిస్తామని సీఎం స్పష్టం చేశారు.

దేశానికి పట్టిన పెద్ద కరోనా వైరస్ కాంగ్రెస్సేనని సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాప్తి జరగకుండా కేంద్రం పటిష్ఠమైన చర్యలు తీసుకుంటోందని కేసీఆర్ కొనియాడారు. అన్ని రాష్ట్రా ప్రభుత్వాలు బాధ్యతాయుతంగానే పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. చివరికి కెనడా ప్రధాని భార్యకు కూడా కరోనా వచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories