నేతన్నలు అద్భుతాలు: పట్టుచీరెలపై కేసీఆర్‌, కేటీఆర్‌ చిత్రాలు

నేతన్నలు అద్భుతాలు: పట్టుచీరెలపై కేసీఆర్‌, కేటీఆర్‌ చిత్రాలు
x
Highlights

తెలంగాణను సాధించి, అభివృద్దిపథంతో రాష్ట్రాన్ని నడిపిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు దండిగా ఉన్నారనే చెప్పుకోవాలి.

తెలంగాణను సాధించి, అభివృద్దిపథంతో రాష్ట్రాన్ని నడిపిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు దండిగా ఉన్నారనే చెప్పుకోవాలి. అభిమానులు వారి మీద ఉన్న అభిమాన్ని తమకు నచ్చిన రీతిలో ప్రదర్శిస్తుంటారు. ఈ నేథ్యంలోనే ఇద్దరు నేతన్నలు తమ అభిమానాన్ని పట్టు చీరలపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ బొమ్మలను వేసి చాటుకున్నారు.

పూర్తి వివరాల్లోకెళ్తే సిరిసిల్లలోని జ్యోతినగర్‌కు చెందిన నేత కార్మికులు నర్సింహస్వామి, హరిప్రసాద్ లు ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌ యంత్రాలపై పట్టుచీరెలను తీర్చిదిద్దుతారు. వీరిద్దరిలో నర్సింహస్వామి రాష్ట్రంలోనే తొలిసారిగా తన కార్ఖానాలో ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌ మరమగ్గాన్ని ఏర్పాటుచేసుకుని పట్టుచీరెలను తయారు చేసేవారు.

ఈ యంత్రాల పనితీరును తెలుసుకున్న కేటీఆర్ వాటిని సిరిసిల్ల కార్మికక్షేత్రంలో ప్రవేశపెట్టాలని భావించారు. అంతే కాకుండా యంత్రాల పనితీరును, దాన్ని వాడడం వలన కలిగే ప్రయోజనాలను అక్కడి నేత కార్మికులకు తెలియజేసే ఏర్పాటుచేశారు. అంతే కాకుండా ఈ యంత్రాలను తీసుకోవాలనుకున్న వారికి పీఎంఈజీపీ ద్వారా 25 శాతం సబ్సిడీపై రుణసౌకర్యం కూడా కల్పించారు.

దీంతో ఎంతో మంది నేతన్నలు ఈ యంత్రాన్ని కొనుగోలు చేసారు. దీంతో వారి కులవృత్తుల గురించ ఆలోచించి, అందరికీ ఉపాధి కల్పిస్తున్నా మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాలను చీరలపై వేయాలను కున్నాడు హరిప్రసాద్. అనుకున్నట్టుగానే వారం రోజుల పాటు కష్టపడి కేసీఆర్, కేటీఆర్ చిత్రాలు ఉన్న పట్టు చీరలను ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌ ప్రతినిధి వెంకట్రావు సౌజన్యంతో డిజైన్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అండగా మంత్రి కేటీఆర్ నిలుస్తున్నారని ఆయన ధన్యవాదాలు తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories