గులాబీ పార్టీలో అనూహ్య పరిణామాలు

గులాబీ పార్టీలో అనూహ్య పరిణామాలు
x
Highlights

గులాబీ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ ఎంపి కవిత రాజకీయ భవిష్యత్ పై ఊహాగానాలకు తెరదించింది టీఆర్ఎస్ అధిష్టానం. నిజామాబాద్ స్థానిక...

గులాబీ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ ఎంపి కవిత రాజకీయ భవిష్యత్ పై ఊహాగానాలకు తెరదించింది టీఆర్ఎస్ అధిష్టానం. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి కవిత అభ్యర్ధిత్వాన్ని ఖారరు చేస్తూ గులబీ బాస్ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభకు కవితను ఎంపిక చేస్తారని విస్తృత ప్రచారం జరిగినా మారిన సమీకరణలతో సిట్టింగ్ ఎంపీ కేకే, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని పెద్దల సభకు పంపించారు. ఎలాగైనా చట్టసభల్లో ప్రాతనిధ్యం ఉండాలని ఆశిస్తున్న కవితను సమయం సందర్భం రావడంతో మండలికి ఎంపిక చేశారు సీఎం కేసీఆర్. ఇందుకు సంబంధించి ఎప్పుడో నిర్ణయం తీసుకొని ఉంటారని పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఓటమి చెందిన కవిత రాజ్యసభ స్థానాన్ని ఆశించారు. రాష్ర్టం నుంచి ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి దక్కుతుందని ఆశించారు. అయితే పార్టీ సీనియర్ నేత, సిట్టింగ్ ఎంపీ కేకకు మరోసారి అవకాశం ఇవ్వడంతో పాటు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని రెండో స్థానానికి ఎంపిక చేశారు సీఎం కేసీఆర్. దీంతో రాజ్యసభ సీటు కవితకు దక్కలేదు. అయినా కవిత ఆశించిన విధంగా చట్టసభల్లో ప్రాతినిద్యం ఉండే విధంగా అవకాశం కల్పించారు గులాబీ బాస్. ఖాళీగా ఉన్న నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్‌ తరపున కవిత పేరు తెరపైకి తీసుకువచ్చారు.

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సిగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన భూపతిరెడ్డిపై అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నిక జరుగుతుంది. 2022 జనవరి 4 తో ఈ ఎమ్మెల్సీ స్థానం పదవీ కాలం ముగియనుంది. గవర్నర్ కోటాలో మరో ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉన్నా ఇంకా నోటిఫికేషన్ జారీ కాలేదు. నిజామాబాద్ ఎమ్మెల్సీకి ఈనెల 19 వరకు నామినేషన్ వేయడానికి గడువు ఉండటంతో కవతి పేరును ఖరారు చేశారు. కవిత ఎమ్మెల్సీగా రావాలని అంతా కోరుకుంటున్నారని జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు.

నిజామాబాద్‌ స్థానిక సంస్థల్లో మొత్తం 824 ఓట్లు ఉన్నాయి. టీఆర్ఎస్ 592 ఓట్లు, కాంగ్రెస్ కు 142, బీజేపీకి 90 ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ నిలిచినప్పటికీ కవిత సునాయాసంగా గెలుపొందనున్నది. ఎన్నిక అనివార్యమైతే ఏప్రిల్‌ 7న పోలింగ్‌, 9న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. మారుతున్న రాజకీయ పరిస్థితులు పార్టీపైన పట్టుకోసమే కవితను ఎంపిక చేసినట్లుగా గులాబీ వర్గాలు చెప్పుకుంటున్నాయిు. త్వరలో మంత్రి కూడా అవుతుందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. పార్టీ, ప్రభుత్వంలోనూ కవిత కీలకంగా వ్యవహరిస్తారని భావిస్తున్నారు సో చూడాలి మరి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories