హ్యాపీ బర్త్‌డే బావా..: కల్వకుంట్ల కవిత

హ్యాపీ బర్త్‌డే బావా..: కల్వకుంట్ల కవిత
x
Highlights

తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు జన్మదినం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక...

తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు జన్మదినం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, ఇతర రంగాల ప్రముఖులు మంత్రికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ... హ్యాపీ బర్త్‌డే బావా అని పేర్కొన్నారు.

మంత్రి హరీశ్ రావుకు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలిపారు. ఆర్థిక మంత్రి గారూ.. మీరు ఇలాంటి పుట్టిన రోజులను మరెన్నో జరుపుకోవాలి. మీరు చిరకాలం ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా జీవించాల'ని కేటీఆర్ ఆకాంక్షించారు. బావా.. మీరు సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉండాలని కేటీఆర్ ట్వీట్ చేశారు. నిరంతం ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతన్న మంత్రి హరీశ్ రావును మంత్రి ప్రశంసలతో ముంచేసారు. ప్రభుత్వంలో, పార్టీలో మీతో కలిసి పని చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందంటూ ఆనందం వ్యక్తం చేసారు.



HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి



Show Full Article
Print Article
More On
Next Story
More Stories