Coronavirus: కరోనా మృతుడితో 100 మంది కాంటాక్ట్‌.. ఐసోలేషన్‌లో 34 మంది

Coronavirus: కరోనా మృతుడితో 100 మంది కాంటాక్ట్‌.. ఐసోలేషన్‌లో 34 మంది
x
Highlights

కర్ణాటకకు చెందిన 76 ఏళ్ల వ్యక్తి కరోనా వ్యాపించి మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కర్ణాటక మంత్రి శ్రీరాములు అధికారికంగా వెల్లడించారు.

కర్ణాటకకు చెందిన 76 ఏళ్ల వ్యక్తి కరోనా వ్యాపించి మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కర్ణాటక మంత్రి శ్రీరాములు అధికారికంగా వెల్లడించారు.మార్చి 10వ తేదీన ఆయన హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందారు. మెడికల్ అడ్వైజరీ తర్వాత అతనిని డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జి అయి కర్ణాటకకు తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందాడు.

దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను చికిత్స కోసం గుల్బర్గాలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో హైదరాబాద్‌ తీసుకొచ్చారు. తొలుత జూబ్లిహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి, ఆ తర్వాత బంజారాహిల్స్‌ లోని మరో కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అడ్మిట్‌ చేసుకోకపోవడంతో మరో ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు అప్పటికే బాధితుడికి కరోనా సోకినట్లు అనుమానించారు. గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. బంధువులు ఆయన్ను గాంధీకి తీసుకెళ‌్లకుండా ఓ ప్రైవేట్‌ అంబులెన్స్‌లో మంగళవారం గుల్బర్గాకు తీసుకెలుతుండగా చనిపోయారు.

దీంతో ఆయనకు చికిత్స అందించిన బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌లోని మూడు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఆయా ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఆదేశించింది. కాగా సిద్దిఖీ సంబంధీకులు, ఆయనతో సన్నిహితంగా ఉన్నవారు చికిత్స అందించినవారు అందరి వివరాలను సేకరించారు. బాధితుడితో కేర్ హాస్పిటల్‌లో 17 మంది కాంటాక్ట్‌లో ఉన్నట్టు గుర్తించారు. వారిలో అంబులెన్స్ స్టాఫ్, వైద్యులు, నర్సులు, గార్డులు ఉన్నారు.

అంతకు ముందు నగరంలో మూడు హాస్పిటల్స్‌కు తీసుకెళ్లిన సమయంలో మరో 100 మంది వారు కాంటాక్ట్ అయినట్టు సమాచారం. అయితే ఈ విషయంపై తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం రాత్రి ఒక ప్రకటన చేసారు. కరోనాతో చనిపోయిన వ్యక్తితో మొత్తం 34 మంది కాంటాక్ట్‌లో ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. వారిని ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంచామని అధికారులు తెలిపారు. వారిలో తలాబ్ కట్టాకు చెందిన మృతుని బంధువుల కుటుంబ సభ్యులు, కేర్ హాస్పిటల్లో ఆయనను పర్యవేక్షించిన నర్సును కూడా ఉన్నారని, పాటుగానే జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌కు చెందిన కనీసం ఐదుగురు ఆయనతో కాంటాక్ట్ అయినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీనివాస్ రావు తెలియజేశారు. ఇక ఈ కేసు గురించిన పూర్తి సమాచారాన్ని తాము ఆరోగ్య శాఖకు అందిచామని కేర్ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం కోసం తెలంగాణ ప్రభుత్వం కర్ణాటకనను సంపద్రించిందని తెలిపారు. కేర్ హాస్పిటల్‌ను సందర్శించిన ఆరోగ్యశాఖ అధికారులు అక్కడి పరిస్థితిని సమీక్షించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories