Top
logo

కరీంనగర్ జిల్లాలో 15 ఏళ్లకు నిరవేరిన రైతుల కల

కరీంనగర్ జిల్లాలో 15 ఏళ్లకు నిరవేరిన రైతుల కల
Highlights

వాన పడితేనే అక్కడి పొలాలకు నీళ్లు. చెరువులు ఉన్న అవి బీడు భూములతో సమానమే. గత 15 ఏళ్లుగా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆ గ్రామాలు ఇప్పుడు సంబరాలు జరుపుకుంటున్నాయి.

వాన పడితేనే అక్కడి పొలాలకు నీళ్లు. చెరువులు ఉన్న అవి బీడు భూములతో సమానమే. గత 15 ఏళ్లుగా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆ గ్రామాలు ఇప్పుడు సంబరాలు జరుపుకుంటున్నాయి. ఎండిన చెరువుల్లో కొత్త ఆశలు చిగురించాయి. కరీంనగర్ జిల్లాలో రైతుల ఆనందంపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్.

కరీంనగర్ జిల్లాలోని కొన్ని గ్రామాలకు 15 సంవత్సరాల క్రితం నిర్మించిన ఎస్సారెస్పీ వరద కాలువ దుఃఖాన్ని నింపింది. వరద కాలువలో నుంచి నీళ్లు వెళుతుంటే తమ పొలాల్లోకి మోటార్ల ద్వారా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు రిడిజైనింగ్ తో ఈ గ్రామాల నీటి కష్టాలు తీరిపోయాయి.

నాగుల మల్యాల గ్రామంతో పాటు మరో 5 గ్రామాల చెరువుల్లోకి గోదావరి నీళ్లు వచ్చి చేరాయి. పదిహేనేళ్లుగా నీళ్లు చూడని నాగుల మల్యాల గ్రామస్తులు ఇప్పుడు ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో పాటు రైతులంతా గోదావరి నీటికి పూజలు చేశారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నాళ్లకు తమ గ్రామంలోని చెరువుకు నీరు రావడంతో రైతుల ఆనందం అంతా ఇంతా కాదు. ఇకపై పంటలకు నీటి సమస్య ఉండదని చెబుతున్నారు. వ్యవసాయం చేయలేక వలస వెళ్లిన ఇక్కడి వారు ఇప్పుడు తిరిగి వస్తామంటున్నారు. బంగారు పంటలు పండించుకుంటమని చెబుతున్నారు.


లైవ్ టీవి


Share it
Top