Top
logo

కరోనా భయంతో వైద్యుల రాజీనామా..

కరోనా భయంతో వైద్యుల రాజీనామా..Representational Image
Highlights

కరోనా వైరస్ చైనాలో పుట్టి ప్రపంచమంత అతి వేగంగా వ్యాపిస్తూ ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంటుంది.

కరోనా వైరస్ చైనాలో పుట్టి ప్రపంచమంత అతి వేగంగా వ్యాపిస్తూ ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంటుంది. వేల మందిని అనారోగ్యం పాలు చేసి ఆస్పత్రుల్లో చేరేలా చేసింది. అలాంటి వైరస్ బాధితులకు వైద్యం అందించి ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు వైద్యులు. తమ ప్రాణాలకు తెగించి కరోనా బాధితులను కాపాడుతున్నారు. కొంత మంది వైద్యులైతే తమ విధుల్లోనే ప్రాణాలను కోల్పోతున్నారు.

కానీ ఇందులు భిన్నంగా కొంత మంది వైద్యులు తమ వృత్తి నుంచి తప్పుకున్నారు. కరోనా రోగులకు వైద్యం చేస్తే వారికి కరోనా వస్తుందేమో అన్న భయంతో విధుల నుంచి తప్పుకున్నారు. ఈ సంఘటన కామారెడ్డిలోని ఓ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ప్రాణాంతక వైరస్ తమకూ సోకుతుందన్న ఆందోళనతో ఆరుగురు వైద్యులు మూకుమ్మడి రాజీనామా చేశారు. కోవిడ్-19 రోగులు అంతకంతకూ పెరుగుతుండటంతో తమపై తీవ్ర ఒత్తిడి పడుతోందని తెలిపారు.

కుటుంబాలను వదిలేసి, 24 గంటల పాటు రోగులకు సేవలు అందిస్తున్నామని అన్నారు. తాము కూడా పనిలో అలసిపోయి అస్వస్థతకు గురవుతున్నామని వైద్యులు తెలిపారు. వైద్యుల కుటుంబ సభ్యులు కూడా వారు విధులకు హాజరవడానికి ఒప్పుకోవడం లేదని వైద్యులు పేర్కొన్నారు.

ఇప్పటికే కరోనా కేసులు విజృభించడంతో కొన్నిప్రయివేటు ఆస్పత్రులను మూసివేశారు. దీంతో రోగులందరూ ప్రభుత్వ ఆస్పత్రినే ఆశ్రయిస్తున్నా. కాగా ఈ వైద్యశాలల్లో రోగుల తాకిడి ఎక్కువ అయింది. దీంతో సుమారుగా రోజుకు 300 మంది కరోనా అనుమానితులు ఆస్పత్రికి వస్తున్నారని వారిలో ఎంత మందికి పాజిటివ్ వస్తుందో అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే వైద్యులు మూకుమ్మడిగా తమ రాజీనామ లేఖను ఆస్పత్రి సూపరింటెండెంట్ సమర్పించారు. తోటి వైద్యులు, సూరింటెండెంట్ ఎంత చెప్పినప్పటికీ వినలేదని తెలిపారు.

Web Titlekamareddy doctors resigned due to coronavirus scare in telangana
Next Story