ఎమ్మెల్సీ ఎన్నిక.. నామినేషన్ దాఖలు చేసిన కవిత

ఎమ్మెల్సీ ఎన్నిక.. నామినేషన్ దాఖలు చేసిన కవిత
x
Kalvakuntla Kavitha
Highlights

ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ లో టీఆర్ఎస్ నేతలతో కలిసి ఆమె నామినేషన్ వేశారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ...

ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ లో టీఆర్ఎస్ నేతలతో కలిసి ఆమె నామినేషన్ వేశారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత పోటీ చేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌లో కవిత తన నామినేషన్‌ను రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్, గంప గోవర్ధన్, సురేందర్‌ తదితరులు ఉన్నారు. కాగా, టీఆర్‌ఎస్‌ నుంచి పలువురు ఆశావాహులు టికెట్‌ ఆశించినప్పటికి పార్టీ అధినేత కేసీఆర్‌ మాత్రం కవిత అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories