కరీంనగర్ ‌చేరిన కాళేశ్వరం నీళ్లు..హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

కరీంనగర్ ‌చేరిన కాళేశ్వరం నీళ్లు..హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
x
Highlights

కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి ఫలితాన్ని కరీంనగర్ నియోజకర్గం అందుకుంది. నియోజకవర్గంలో ని 7 గ్రామాలకు నీటిని విడుదల చేశారు స్థానిక ఎమ్మెల్యేలు గంగుల...

కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి ఫలితాన్ని కరీంనగర్ నియోజకర్గం అందుకుంది. నియోజకవర్గంలో ని 7 గ్రామాలకు నీటిని విడుదల చేశారు స్థానిక ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్,సుంకే రవి శంకర్. మేడిగడ్డ నుండి లిఫ్ట్ చేస్తున్న నీళ్ళ ని డెరెక్టు గా మొదటి ఫలితాన్ని పొందారు కరీంనగర్ రైతులు.

కాళేశ్వరం ప్రాజెక్టులో తొలి ఫలితాన్ని అందుకున్నారు కరీంనగర్ రైతులు. మేడిగడ్డ నుండి లిఫ్ట్ చేసిన గోదావరి నీళ్లు పూర్తి ప్రవాహంగా లింకు లోని ఎనిమిదో ప్యాకేజీకి చేరుకున్నాయి. కరీంనగర్ మండలం నాగుల మాల్యాల గ్రామ చెరువులోకి నీళ్లు వదిలారు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సుంకే రవి శంకర్. వరద కాలువ ద్వారా వెళ్తున్న నీటిని దానికి అనుసంధానంగా నిర్మించిన అప్రోచ్ కెనాల్ దగ్గర రైతులతో కలిసి గోదావరి నీటి కి పూజలు చేసి సంబరాలు జరుపుకున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు లోని లింక్ 2 లో ఉన్న 8 వ ప్యాకేజీ లో మోటర్లకు నిర్వహిస్తున్న వెట్ రన్ తో వరద కాలువ ద్వారా మిడ్ మానేరు డ్యామ్ కి నీళ్లు సుమారు 6 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. దీంతో గంగాధర మండలం ఆచంపల్లి గ్రామ శివారులో వరద కాలువకు అనుసంధానంగా నిర్మించిన అప్రోచ్ కెనాల్ ద్వారా నీటిని మళ్లించారు. కరీంనగర్ మండలంలోని ఏడు గ్రామాల చెరువులోకి నీటిని విడుదల చేశారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లో డెరెక్టు గా తొలిఫలితాన్ని ఇక్కడి రైతులు అందుకున్నారు. మేడిగడ్డ నుండి లిఫ్ట్ చేసిన నీళ్లు మొట్టమొదటి సరిగా చెరువులోకి వెళ్లి రైతులకు ఉపయోగపడతుండటం తో రైతులు అనందంతో సంబరాలు చేసుకున్నారు.

ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుండి వచ్చే వరద నీటిని మిడ్ మానేరుకు తరలించేందుకు నిర్మించిన వరద కాలువ పుట్టినప్పటినుంచి సరిగా నీటి అవసరాలు తీర్చలేక పోయింది. ఫలితంగా ఇక్కడున్న గ్రామాల్లో చెరువులు భూగర్భ జలాలు అడుగంటి పోయాయి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగంగా ఎస్సారెస్పీ ప్రాజెక్టు కు సంబంధం లేకుండా ఎల్లంపల్లి నుండి ఎనిమిదో ప్యాకేజీ కి అక్కడ నుండి వరద కాలువ ద్వారా నీళ్లు వదలడంతో రైతులకు సాగునీటి కష్టాలు తీరి పోయాయని స్థానిక గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories