Top
logo

తప్పిన ఘోర ప్రమాదం..నడుస్తుండగానే ఊడిన బస్సు చక్రాలు

తప్పిన ఘోర ప్రమాదం..నడుస్తుండగానే ఊడిన బస్సు చక్రాలు
Highlights

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. నార్కట్‌పల్లి నుంచి నల్లగొండ...

నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. నార్కట్‌పల్లి నుంచి నల్లగొండ వెళ్తుండగా బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. అయితే డ్రైవర్ అప్రమత్తత వల్ల ప్రయాణీకులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో అక్కడక్కడ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అనుభవం లేని డ్రైవర్లను పెట్టి ప్రయాణికుల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు పేర్కొన్నారు.

Next Story