టీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డ నడ్డా..బీజేపీలో చేరిన వివిధ పార్టీలకు చెందిన 30 మంది నేతలు

టీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డ నడ్డా..బీజేపీలో చేరిన వివిధ పార్టీలకు చెందిన 30 మంది నేతలు
x
Highlights

తెలంగాణపై బీజేపీ కన్నేసింది రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటున్న కమల నాథులు రాష్ట్రంలో పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో...

తెలంగాణపై బీజేపీ కన్నేసింది రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటున్న కమల నాథులు రాష్ట్రంలో పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో వివిధ పార్టీలకు చెందిన 30 మంది నేతలను బీజేపీలోకి ఆహ్వానించారు.

తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా రెండు రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు ఇందులో భాగంగా హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఇతర పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. తెలంగాణ లాంటి పుణ్యభూమిపై అడుగుపెట్టే అవకాశం తనకు దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీపై తనదైన స్టైల్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజావ్యతిరేక పాలన నడుస్తోందని విమర్శించారు. తెలంగాణలో 3లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయడం లేదని విమర్శించారు.

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణలా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ విమర్శించారు. బాధల్లో ఉన్న తెలంగాణ ప్రజలను గట్టు ఎక్కించాల్సిన బాధ్యత తమపై ఉందన్న లక్ష్మణ్ పల్లెల్లో బిందెడు నీళ్లు దొరకడం లేదు కానీ బీర్లు దొరుకుతున్నాయంటూ విమర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు, ఎర్రశేఖర్ తో పాటు వివిధ పార్టీలకు చెందిన దాదాపు 30 మంది నేతలు నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. మొత్తానికి తెలంగాణలో పార్టీకి రోజు రోజుకీ బలం పెరుగుతుండటంతో పార్టీనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories