jobs : మల్లేపల్లి ఐటీఐలో జాబ్‌మేళా

jobs : మల్లేపల్లి ఐటీఐలో జాబ్‌మేళా
x
Highlights

నిరుద్యోగ యువతీ, యువకులకు మల్లేపల్లి బాలుర ఐటీఐ క్యాంపస్ మంచి అవకాశాన్ని అందిస్తుంది. ఈ నెల 20న ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగవకాశాలను కల్పించడానికి ఐటీఐ...

నిరుద్యోగ యువతీ, యువకులకు మల్లేపల్లి బాలుర ఐటీఐ క్యాంపస్ మంచి అవకాశాన్ని అందిస్తుంది. ఈ నెల 20న ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగవకాశాలను కల్పించడానికి ఐటీఐ క్యాంపస్ ఉపాధి కార్యాలయంలో మీడియం జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ అండ్ గైడెన్స్ బ్యూరో (యుఈఐ/జీబీ) డిప్యూటీ చీఫ్ అధికారి ఎన్.ఆనంతరెడ్డి స్పష్టం చుసారు. హైదరాబాద్ లోని పలు సంస్థలలో పనిచేయుటకు దాదాపు 900 నిరుద్యోగులను ఎంపిక చేయనున్నారు.

కాలీబ్ హెచ్‌ఆర్, సెంటినీ బయోఫ్లాంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఒప్పో మొబైల్స్, యాక్సిస్ బ్యాంకు, హాయ్ కేర్ సర్వీసెస్, శుభగృహ ప్రాజెక్ట్సు, అపోలో హోంకేర్, చోళ ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్, కార్వీ ఫోర్డ్ సర్చ్ ప్రైవేట్ లిమిటెడ్, అపోలో ఫార్మసీ, పేరంగ్రూప్, ఆక్ట్ ఫైబర్‌నెట్ తదితర ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. జిల్లాలో ఉన్న ఆసక్తి గల నిరుద్యోగులు ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీలతో ఈ నెల 20వ తేదీ ఉదయం 10.30 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయం/మోడల్ కెరియల్ సెంటర్‌లో హాజరుకావాలి. మరిన్ని వివరాలకు 8247656356, 8886884049లకు కాల్ చేసి సంప్రదించవచ్చన్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories