Janata Curfew: ఇంటివద్దకే అంగన్ వాడీ సరుకులు: మంత్రి సత్యవతి రాథోడ్

Janata Curfew: ఇంటివద్దకే అంగన్ వాడీ సరుకులు: మంత్రి సత్యవతి రాథోడ్
x
Satyavathi Rathode
Highlights

కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా అంగన్ వాడీ కేంద్రాలను మూసేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారు.

కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా అంగన్ వాడీ కేంద్రాలను మూసేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారు. ఈ నేపథ్యంలోనే అంగన్ వాడీ కేంద్రాలలో చిన్న విల్లలకు, బాలింతలకు, గర్భిణులకు ఇచ్చే సరుకులని ఇంటి వద్దకే పంపిణీ చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. అంగన్ వాడీ కేంద్రాలలో ఇచ్చే బియ్యం, పప్పు, నూనే, పాలు, గుడ్లు, బాలామృతం, మురుకులు పంపిణీని గ్రామ కమిటీ ద్వారా చేపట్టాలని ఆదేశించారు. అంగన్ వాడీ కేంద్రాలు మూసివేయడం వలన సరుకులు రాకుండా ఉండవని, సరుకులన్నింటిని ఇంటికి పంపిస్తామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే శాఖ కమిషనర్, కార్యదర్శి దివ్యతో మంత్రి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం మహిళా –శిశు సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం 3.3 లక్షల మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారని తెలిపారు. 3 నుంచి 6 ఏళ్ల లోపు బాల, బాలికలు 4.40 లక్షల మంది ఉన్నారన్నారని తెలిపారు. అదే విధంగా 8.40లక్షల మంది పిల్లలు ఏడు నెలల నుంచి 3 సంవత్సరాల లోపు ఉన్నారని స్పష్టం చేసారు. వీరందరికీ సకాలంలో అందిస్తామని తెలిపారు. పాలు, గుడ్లు, నూనె, సరుకులు అందించే ప్రభుత్వ పంపిణీ సంస్థలను ఎప్పటికప్పుడు సంప్రదిస్తామని తెలిపారు.

సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు గ్రామాలు, పట్టణాల్లో ప్రసవానికి చేరువలో ఉండే గర్భిణీ స్త్రీల జాబితా సిద్ధం చేసుకోవాలని దివ్య తెలిపారు. గ్రామ కమిటీలో అంగన్ వాడీ టీచర్, ఆయా, గ్రామ కార్యదర్శి, ఆశా వర్కర్, స్థానిక పోలీస్ ను భాగస్వామ్యం చేయాలన్నారు. మహిళా – శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే శిశు విహార్ లో చిన్న పిల్లల ఆరోగ్య సంరక్షణ నేపథ్యంలో ప్రత్యేక శ్రధ్ద పెట్టి, పరిశుభ్రత పాటించాలన్నారు. గ్రామంలో, పట్టణంలో ఎవరైనా కరోనా లక్షణాలున్నట్లు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories