Top
logo

గవర్నర్ నరసింహన్‌తో పవన్, నాదెండ్ల భేటీ.. చర్చించిన అంశాలు ఇవేనా?

గవర్నర్ నరసింహన్‌తో పవన్, నాదెండ్ల భేటీ.. చర్చించిన అంశాలు ఇవేనా?
X
Highlights

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.గవర్నర్ నరసింహన్‌తో పవన్, నాదెండ్ల భేటీ గారిని జనసేన పార్టీ అధినేత పవన్...

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.గవర్నర్ నరసింహన్‌తో పవన్, నాదెండ్ల భేటీ గారిని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మెన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని రాజభవన్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల విషయాలతోపాటు దేశాభివృద్ధి పై ఈ సందర్భంగా వారు ఎక్కువగా ముచ్చటించుకున్నారు. రాబోయే రోజులలో భారతదేశం ప్రపంచంలో ఎటువంటి ప్రముఖ స్థానంలో ఉండబోతుంది, మన అభివృద్ధి పయనం, లక్ష్యాలను సాధించడానికి ఎటువంటి ప్రణాళికలు అవసరం వంటి విషయాలను చర్చించారు. దేశాభివృద్ధి, దేశ సమగ్రతలపై జనసేన పార్టీ ఆలోచనలు గురించి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ గవర్నర్ గారికి వివరించారు.Next Story