Top
logo

'ఆ ప్రాజెక్టుకు జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలి'

జైపాల్‌రెడ్డి జయంతి వేడుకలు
Highlights

హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులో కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత జైపాల్‌రెడ్డి జయంతి సందర్భంగా ఆయన ఘాట్‌ వద్ద...

హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులో కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత జైపాల్‌రెడ్డి జయంతి సందర్భంగా ఆయన ఘాట్‌ వద్ద పలువురు రాజకీయ నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, వీహెచ్‌, కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

జైపాల్‌రెడ్డి పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాలు తెలంగాణ ఖ్యాతిని పెంచాయన్నారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ జైపాల్‌రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలని కాంగ్రెన్‌ ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Web TitleJaipal Reddy should be named for the project

లైవ్ టీవి


Share it
Top