తెరవెనుక తెలంగాణా హీరో ...

తెరవెనుక తెలంగాణా హీరో ...
x
Highlights

తెలంగాణా ప్రజల దశాబ్ధాల కోరిక తెలంగాణా రాష్ట్రాన్ని సాధించడం .. అ తెలంగాణా రాష్ట్రం సాధించడం కోసం ఎందరో ఉద్యమాన్ని నడిపించారు . అందులో తెలంగాణా...

తెలంగాణా ప్రజల దశాబ్ధాల కోరిక తెలంగాణా రాష్ట్రాన్ని సాధించడం .. అ తెలంగాణా రాష్ట్రం సాధించడం కోసం ఎందరో ఉద్యమాన్ని నడిపించారు . అందులో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వాళ్ళు ఉద్యమాన్ని తారా స్థాయికి తీసుకువెళ్లారు . విద్యార్దుల ఆత్మహత్యలు ,ఉద్యోగుల నిరసనలు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న కోరికను బలంగా వినిపించేలా చేసాయి. ఇవి మనకు తెరపైన కనిపించేవి ఒకెత్తు అయితే, తెర వెనుక తెలంగాణా రాష్ట్రం కోసం పోరాటం చేసిన రాజకీయ యోధుడు జైపాల్ రెడ్డిది మరో ఎత్తు ..

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలంటే ససేమిరా అన్నటువంటి సోనియా గాంధీ , మన్మోహన్ సింగ్ , ప్రణబ్ ముఖర్జీ లాంటి నేతలను ఒప్పించడంలో అయన పాత్ర అమోఘం అనే చెప్పాలి . వారిని ఒప్పించడానికి తన సొంత పార్టీ నేతలకే అయన ఓ విపక్షంలాగా మారారని చెబుతుంటారు అయన సన్నిహితులు .. ఇక అందులో ట్రబుల్ షూటర్ గా పేరుపొందిన ప్రణబ్ ముఖర్జీతో చాలా సార్లు అయన వాగ్వాదానికి దిగారు .

ఇక తెలంగాణా ఉద్యమ సమయంలో ఇంచార్జ్ గా దిగ్విజయ్ సింగ్ ని ఇంచార్జ్ గా రప్పించడంలో జపాల్ రెడ్డి పాత్ర చాలానే ఉంది . అప్పటికే మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్ గడ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడంలో దిగ్విజయ్ సింగ్ మెయిన్ రోల్ పోషించారు . ఇక దిగ్విజయ్ సింగ్ ఇంచార్జ్ గా రావడంతో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి ఏర్పాట్లు చక చక జరిగిపోయాయి ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories