గుడుంబా కోసం బెల్లం విక్రయాలు బంద్..ఆగ్రహంతో వినియోగదారులు!

గుడుంబా కోసం బెల్లం విక్రయాలు బంద్..ఆగ్రహంతో వినియోగదారులు!
x
Highlights

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బెల్లం కటకట ఏర్పడింది. నల్ల బెల్లమే కాదు ఎర్రబెల్లం కూడా దొరకడం లేదు. బెల్లంతో గుడుంబా తయారుచేస్తున్నారనే కారణంతో అబ్కారీ శాఖ...

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బెల్లం కటకట ఏర్పడింది. నల్ల బెల్లమే కాదు ఎర్రబెల్లం కూడా దొరకడం లేదు. బెల్లంతో గుడుంబా తయారుచేస్తున్నారనే కారణంతో అబ్కారీ శాఖ బెల్లంపై ఆంక్షలు విధించింది. నిత్యావసర వస్తువుల్లో ఒక్కటైనా బెల్లంపై నిషేధం విధించడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అబ్కారీ శాఖ తీరును తప్పుపడుతున్నారు.

ఖమ్మం జిల్లాలో బెల్లం కొరత ఏర్పడింది. నల్లబెల్లంతో పాటు ఎర్ర బెల్లంకూడా దొరకడం లేదు. నిత్యావసర వస్తువుల్లో ఒక్కటైనా బెల్లం లభించకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెల్లంతో నాటు సారా తయారుచేస్తున్నారనే కారణంతో అబ్కారీ శాఖ విధించిన ఆంక్షలే బెల్లం కొరతకు కారణం.

కరోనా కట్టడికి దాదాపు రెండు నెలలు మద్య నిషేధం విధించిన ప్రభుత్వం ఇటీవల పరిమిత సమయాల్లో మద్య విక్రయానికి అనుమతి ఇచ్చింది. మధ్య నిషేధం సమయంలో మారుమూల ప్రాంతాల్లో నల్లబెల్లంతో నాటు సారా తయారు చేస్తుండడంతో నల్ల బెల్లం అమ్మకాలను అధికారులు నిషేధించారు. ఆ తర్వాత ఎర్రబెల్లాన్ని కూడా నాటు సారాలో ఉపయోగిస్తున్నారనే అనుమానంతో ఎర్రబెల్లంపై కూడా ఆంక్షలు విధించారు.

నిత్యావసర వస్తువుల్లో ఒక్కటైనా బెల్లం దొరక్కపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు వంటల్లో బెల్లం వినియోగిస్తే, కొందరు ప్రసాదంగా దేవతలకు పెడతారు. బెల్లంపై ఎక్సైజ్ శాఖ అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని అసహానం వ్యక్తం చేస్తున్నారు.

బెల్లం కొరత కారణంగా భారీగా ధర పెరిగింది. లాక్ డౌన్ కు ముందు కిలో 60 రూపాయలు ఉన్న బెల్లం ధర ఇప్పుడు 80 రూపాయలకు చేరుకుంది. బెల్లం కోసం కిరాణం షాపుల వారు, కస్టమర్లు వచ్చిపోతున్నారని, అబ్కారీ శాఖ ఆదేశాలతో బెల్లం విక్రయించడంలేదని హోల్ సేల్ వ్యాపారులు వాపోతున్నారు.

కొన్ని హోల్ సేల్ షాపుల్లో ఉన్న కిద్దిపాటి బెల్లాన్ని కూడా అబ్కారీ శాఖ అధికారులు విక్రయించరాదని, స్టాక్ వివరాలను రాసుకుపోయారు. 45 రోజుల తర్వాత స్టాక్ ఉన్న బెల్లాన్ని అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చారు. గుడుంబా తయారీకి బెల్లం వెళ్లకుండా నిఘా పెట్టాల్సిన బాధ్యత అబ్కారీ శాఖది అని, జనాల్ని ఇబ్బంది పెట్టడం సరికాదంటున్నారు. కనీసం ఒక్కో కస్టమర్ కు కిలో, రెండు కిలోల బెల్లాన్ని అయినా అమ్ముకునేందుకు పర్మిషన్అనుమతి ఇవ్వాలని వ్యాపారులు కోరుతున్నారు.

నాటు సారా తయారీ చేస్తున్నారనే సాకుతో బెల్లంపై అబ్కారీ శాఖ ఆంక్షలు విధించడంపై వినియోగదారులు సరికాదని, వెంటనే మార్కెట్ లో బెల్లం అందుబాటులో ఉండేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories