మేడారానికి బెల్లం..రేటుకు లేదు కళ్లెం

మేడారానికి బెల్లం..రేటుకు లేదు కళ్లెం
x
Highlights

అదివాసీల ఆరాధ్య దైవం మేడారం సమ్మక్క సారలమ్మలు. అ దేవతలకు అత్యంత ప్రీతికరమైన బెల్లాన్ని బంగారం రూపంలో భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.

అదివాసీల ఆరాధ్య దైవం మేడారం సమ్మక్క సారలమ్మలు. అ దేవతలకు అత్యంత ప్రీతికరమైన బెల్లాన్ని బంగారం రూపంలో భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం జాతర వచ్చింది అంటే చాలు వ్యాపారులు బెల్లం రేట్ పెంచుతారు. బెల్లం ధర పెరుగుతుండడంతో భక్తులు బెల్లంతో పాటు చక్కెరను మొక్కుగా సమర్పిస్తున్నారు.

మేడారం జాతరకు వచ్చే భక్తులు సమ్మక్క, సారలమ్మ దేవతలకు బెల్లం రూపంలో మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవార్లకు సమర్పించే బెల్లాన్ని బంగారంగా భావిస్తారు. కొందరు భక్తులు తమ బరువుకు తగ్గ బెల్లాన్ని జోకి సమర్పిస్తారు. ఇదే ఛాన్స్ గా వ్యాపారులు ఒక్కసారిగా బెల్లం రేట్ పెంచారు.

సాధారణంగా కిలో బెల్లం ధర 33 రూపాయల లోపు వుంటుంది. మేడారం జాతర రావడంతో వ్యాపారులు 12 రూపాయల దాకా పెంచారు వ్యాపారులు. కిలో బెల్లం 45 రూపాయలకు విక్రయిస్తున్నారు. అమ్మవార్లకు భక్తులు తప్పనిసరిగా నిలువెత్తు బంగారం సమర్పిస్తారు అనే ధీమాలో వ్యాపారులు సిండికేట్ అయినట్లు తెలుస్తోంది.

బెల్లం రేట్ పెరిగినా అమ్మవార్లకు బంగారం మొక్కు చెల్లించడం తప్పనిసరి అంటున్నారు భక్తులు. బెల్లం ధర పెరగడంతో కొందరు భక్తులు చక్కెర సమర్పిస్తున్నారు. భక్తులు బెల్లం కొనుగోలుకు వస్తే కొరత ఉందని ధర పెంచి అమ్ముతున్నారు అని భక్తులు వాపోతున్నారు.

మేడారం జాతర సమయంలో ఎక్కువగా మహారాష్ట్రలోని పూణె, నాందేడ్‌ నుండి వరంగల్‌ బీట్‌బజార్‌కు బెల్లం వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. హోల్ సేల్ ధరలో కిలో 33 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తారు. సాధారణంగా కిలోకు రెండు మూడు రూపాయల లాభంతో అమ్మే వ్యాపారులు మేడారం జాతర నేపథ్యంలో అధిక లాభానికి అమ్ముతున్నారు. భక్తులు బెల్లంతో పాటు చక్కెర మొక్కులు చెల్లిస్తుండడంతో బెల్లానికి అంతగా డిమాండ్ వుండడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. జాతర నేపథ్యంలో బెల్లం ధర అదుపులో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories