Top
logo

రాజకీయాల్లోకి వచ్చాక అప్పులు బాగా చేశా : జగ్గారెడ్డి

రాజకీయాల్లోకి వచ్చాక అప్పులు బాగా చేశా : జగ్గారెడ్డి
Highlights

ప్రజల కోసం కేసీఆర్ దగ్గర తల వంచుతా అని అన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ...

ప్రజల కోసం కేసీఆర్ దగ్గర తల వంచుతా అని అన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వనని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా కూడా ఎవ్వరూ ఇవ్వదన్నారు. సంగారెడ్డి అభివృద్ధే ముఖ్యమని తెలిపారు. తాను ఏది చేసినా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల కోసమేనని తెలిపారు.

కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చాక అప్పులు బాగా చేశానని చెప్పారు జగ్గారెడ్డి. అప్పులతోనే పండగలు, పబ్బాలు చేస్తున్నానని అన్నారు. తనకు ఇప్పుడు వంద కోట్ల రూపాయల అప్పుందని పేర్కొన్నారు. తాను ఎవరి దగ్గర ప్పులు తీసుకున్నారో.... వారిని స్టేజీ మీదకు పిలిచి మరీ కార్యకర్తలకు జగ్గారెడ్డి పరిచయం చేశారు.

Next Story