టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేస్తోంది: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేస్తోంది: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
x
జగ్గారెడ్డి
Highlights

ఇటీవల జరిగిన ఒక సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

ఇటీవల జరిగిన ఒక సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అలా మాట్లడడం సరికాదని ఆయన ఎర్రబెల్లి దయాకర్ రావుని విమర్శించారు. గురువారం గాంధీభవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి పదవిని త్యాగం చేసిన రాహుల్ గాంధీని కేటీఆర్‌తో పోల్చడం సరికాదని అన్నారు. రాహుల్‌ స్థాయికి, కేటీఆర్‌ స్థాయికి పోలిక ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ మంత్రులు రాహుల్ గాంధీ గురించి చిల్లర విమర్శలు మానుకోవాలని జగ్గారెడ్డి హెచ్చరించారు.

కేటీఆర్‌ను పొగుడుకో, భజన చేసుకో తప్పులేదు కానీ కేటీఆర్ దగ్గర చెంచాగిరి చెయ్యకు అని నాయకులకు హితవుపలికారు. ప్రభుత్వ అధికారులను, డబ్బును, పోలీస్లను ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత పనులకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పదవిలో ఉన్నప్పుడు ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదని అన్నారు. అంతే కాక ఎన్నికల్లో అధికార పార్టీ మద్యం, డబ్బులు పంపిణీ చేస్తుంటే పోలీసులు వారికి భద్రత కల్పిస్తున్నారన్నారు.

అంతే కాకుండా ఎన్నికల అధికారులు టీఆర్ఎస్‌కు అమ్ముడు పోయారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ ఖరారుకు మ‌రియు నోటిఫికేషన్‌కు మ‌ధ్య కనీసం వారం పది రోజులు వ్యవధి ఉండాలన్నారు. ఏ మున్సిపాలిటీని ఎంత మేరకు అభివృద్ధి చేశారో టీఆర్ఎస్ నాయకులు చెప్పగలరా అని ఎద్దేవా చేసారు. స్కూల్స్ లో పిల్లలను లెక్కలు అడుగుతున్న హరీష్ తమ నియోజకవర్గ ప్రజల మంచినీటి కష్టాల గురించి మాట్లాడరా అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories