చలాకి చంటి కారుకు ప్రమాదం

చలాకి చంటి కారుకు ప్రమాదం
x
Highlights

టాలీవుడ్ హాస్య నటుడు, జబర్దస్త్ టీమ్ మెంబర్ చలాకీ చంటి రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది....

టాలీవుడ్ హాస్య నటుడు, జబర్దస్త్ టీమ్ మెంబర్ చలాకీ చంటి రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న చలాకి చంటి కారు లారీ వెనుక‌ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే చంటిని కోదాడ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి మెరుగ్గానే ఉంద‌ని అంటున్నారు. గతంలో కూడా చంటి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. గ‌త కొద్ది రోజులుగా టాలీవుడ్‌కి సంబంధించిన‌ హీరోలు గాయాల‌ బారిన ప‌డ‌డం తెలుగు సినీ అభిమానుల‌ని ఎంత‌గానో క‌ల‌వ‌రపరుస్తుంది. రోడ్డు ప్రమాదాలు, షూటింగ్‌లో అపశ్రుతుల కారణంగా పలువురు యువ హీరోలు గాయపడిన సంగతి తెలిసిందే.













Show Full Article
Print Article
More On
Next Story
More Stories