తెలంగాణలో ముందే వచ్చిన ఎండాకాలం

తెలంగాణలో ముందే వచ్చిన ఎండాకాలం
x
తెలంగాణలో ముందే వచ్చిన ఎండాకాలం
Highlights

ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే తెలంగాణలో ఎండలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని హకీంపేట మినహా దాదాపు అన్నిచోట్లా 40 డిగ్రీల...

ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే తెలంగాణలో ఎండలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని హకీంపేట మినహా దాదాపు అన్నిచోట్లా 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. శనివారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో గత పదేళ్ల రికార్డును పటాపంచలు చేస్తూ 41 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

తెలంగాణలో నెల రోజుల ముందే చలి చెక్కేస్తునట్లు ఉంది. శివరాత్రి జాగారంతో శివ శివా అంటూ పోవాల్సిన చలి పులి ముందే పారిపోయినట్లుంది. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు వేసవి ప్రారంభ రోజుల స్థాయికి చేరుకున్నాయి.

చల్లని పవనాల రాక తగ్గిపోవడంతో తెలంగాణలో శీతాకాలం కేవలం రెండు రోజులే తీవ్రత చూపింది. గత డిసెంబరు 28, 29వ తేదీలోనే చలి తీవ్రత అధికంగా ఉంది. మారుతున్న వాతావరణంతో ఉష్ణోగ్రత నమోదయ్యే దినాలు రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్నాయి.

ప్రస్తుతం వాతావరణంలో కర్బన సమ్మేళన వాయువుల శాతం ప్రభావం చూపుతున్నాయి. దీనికితోడు బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాలులతో రాత్రిపూట వాతావరణంలో వేడి తగ్గడం లేదు. చీకటి పడగానే వేడంతా ఉపరితలంపైకి చేరాల్సి ఉండగా తిరిగి భూమిని చేరుతుండటంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు వేసవి ప్రారంభ రోజులను తలపిస్తున్నాయి. గతేడాది వేసవిలో రాష్ట్రంలో సాధారణం కన్నా సగటున 1-1.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాదీ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఖమ్మంలో పదేళ్ల స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. 2016 జనవరి 30న 33.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదుకాగా మంగళవారం 33.8 డిగ్రీలు నమోదైంది. మహబూబ్‌నగర్‌లో 34.9, నిజామాబాద్‌ 34.4, భద్రాచలం 34.2తోపాటు రామగుండం, హైదరాబాద్‌, హన్మకొండలలో 33 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ఈ ఏడాది నెలరోజుల ముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడం చూస్తుంటే మున్ముందు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో జనం భయపడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories