జీహెచ్ఎంసీకి ముందస్తు వచ్చేనా.. అధికార, విపక్షాల వ్యూహమేంటి?

జీహెచ్ఎంసీకి ముందస్తు వచ్చేనా.. అధికార, విపక్షాల వ్యూహమేంటి?
x
జీహెచ్ఎంసీకి ముందస్తు వచ్చేనా.. అధికార, విపక్షాల వ్యూహమేంటి?
Highlights

గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తుందా..? అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏం ప్లాన్ చేస్తున్నాయి.? గ్రేటర్ వేదికగా గులాబీ, కమలం...

గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తుందా..? అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏం ప్లాన్ చేస్తున్నాయి.? గ్రేటర్ వేదికగా గులాబీ, కమలం పార్టీలు ఎన్నికల కోసమే కత్తులు దూస్తున్నాయా...? పాతబస్తీలో పతంగి పార్టీ ఎత్తులు ఏంటి..? గ్రేటర్‌లో జరుగుతున్న రాజకీయాలు ఏం చెబుతున్నాయి...?

గులాబీ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. వరుస ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీఆర్ఎస్‌కు జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలు ముందున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా ముందస్తు ఎన్నికలకు పోతుందన్న చర్చ సాగుతోంది. మళ్లీ గ్రేటర్‌పై గులాబీ జెండా ఎగురవేసేందుకు రెడీ అవుతోంది.

గత ఎన్నికల్లో 99 స్థానాలు సాధించిన టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించారు. అందు కోసమే నగరంలో అభివృద్ధి పనులను పరుగెత్తిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్‌ కోసం ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం మరోసారి టీఆర్ఎస్‌కు సహకారం అందించే అవకాశం కనిపిస్తోంది.

ఇటు బీజేపీ గ్రేటర్‌లో తమ సత్తా చాటేందుకు ఉబలాట పడుతోంది. ఇప్పటి నుంచే టీఆర్ఎస్, ఎంఐంఎం పార్టీలను టార్గెట్ చేస్తూ విమర్శల బాణాలు ఎక్కుపెడుతోంది. కేంద్రమంతి కిషన్‌రెడ్డితో పాటు ఇతర నాయకులు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఎంఐఎంతో జతకట్టి తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.

కేంద్రం తెలంగాణకు సరిగా నిధులివ్వడం లేదన్న టీఆర్ఎస్ నేతల మాటలను బీజేపీ నేతలు తిప్పి కొడుతున్నారు. అయితే గ్రేటర్‌లో బీజేపీ మరింత బలపడకముందే దెబ్బ కొట్టాలనే ఆలోచనలో గులాబీ పార్టీ ఉంది. గ్రేటర్‌ ఎన్నికల్లో భాగంగానే టీఆర్ఎస్ కేంద్రం ప్రవేశపెట్టిన సీఏఏ, ఎన్నార్సీల బిల్లును వ్యతికించినట్లు తెలుస్తోంది. ఈ బిల్లుపై ఉద్యమాలు చేస్తున్న ఎంఐఎంతో మిత్రుత్వం కలిసి వస్తుందని టీఆర్ఎస్‌ భావిస్తోంది.

అయితే ఇప్పటికిప్పుడు గ్రేటర్‌ ఎన్నికలకు వెళ్లాలంటే అనేక అడ్డంకులు టీ సర్కార్‌ ఎదుర్కోవాల్సి రావచ్చు. పాలక మండలి గడువు ముగియకముందే రద్దు చేస్తే ప్రతిపక్షాలు న్యాయ పోరాటం చేస్తాయి. ఎన్నికలకు రెండు మూడు నెలల గడువు పడుతుంది. అధికార పార్టీ ఏ వ్యూహంతో ముందుకుకెళుతుందోనని ప్రతిపక్షాలను గందరగోళ పరుస్తోంది. గ్రేటర్ ఎన్నికలు పూర్తయితే తమకు కాస్త ఊరటనిస్తుందని అధికార పార్టీ అంచనా వేస్తోంది. ఇక ముందస్తు ముహూర్తం ఎప్పుడు ఖరారు చేస్తుందనేది ఉత్కంఠగా మారింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories