రేవంత్‌-రాజగోపాల్‌ రూటే సెపరేటా?

రేవంత్‌-రాజగోపాల్‌ రూటే సెపరేటా?
x
Highlights

ఆ ఇద్దరూ ఫైర్‌ బ్రాండ్‌ లీడర్లు. మాటల తూటాలు పేల్చడంలో ఏకే ఫార్టీ సెవన్‌లు. వ్యూహాలు వేయడంలో తిరుగులేని నాయకులు. కానీ ఎంతటి లీడర్లయినా పార్టీ...

ఆ ఇద్దరూ ఫైర్‌ బ్రాండ్‌ లీడర్లు. మాటల తూటాలు పేల్చడంలో ఏకే ఫార్టీ సెవన్‌లు. వ్యూహాలు వేయడంలో తిరుగులేని నాయకులు. కానీ ఎంతటి లీడర్లయినా పార్టీ అజెండాతోనే ముందుకు సాగాలన్నది జనరల్‌ రూల్. కానీ వారిద్దరూ అంతకుమించి అంటున్నారు. పార్టీతో సంబంధంలేకుండా, సొంత ఇమేజ్‌ బిల్డప్‌ చేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారట. ఒకవేళ పార్టీ దూరం పెట్టినా, సొంత పార్టీ పెట్టి దుమ్మురేపి, దమ్ము చూపాలని ఉవ్విళ్లూరుతున్నారట. ఇంతకీ ఎవరా ఇద్దరు?

అధికార పార్టీని సమిష్టిగా ఎదుర్కోవడంలో, తెలంగాణ కాంగ్రెస్‌ విఫలమవుతోందన్న చర్చ, అదే పార్టీలో సాగుతోంది. గులాబీ దళాన్ని ఎలా ఎదుర్కోవాలి, ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్నదానిపై ఎవరికివారే యమునాతీరే అన్నట్టుగా సాగుతున్నారు. పీసీసీ రేసు నేపథ్యంలో గ్రూపు రాజకీయాలు మరింత ఎక్కువయ్యాయి.

పార్టీలో సీనియర్లు అధికారపార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయడంతోపాటు , అసెంబ్లీ వేదికగా కూడా గట్టిగా విమర్శించకుండా సొంత ప్రయోజనాల కోసం పార్టీని తాకట్టుపెడుతున్నారనే విమర్శలున్నాయి. దీంతో పార్టీలో కొందరు నేతలు పార్టీ ప్రయోజనం కంటే వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

అధికార టిఆర్ఎస్‌పై ఉమ్మడిగా పోరాటం చేయాల్సిన నేతలంతా ఎవ్వరికి వారే వ్యక్తిగత ఎజెండాతో ముందుకెళుతున్నారు. దీంతో పార్టీ సీనియర్లు వారి తీరుపై తీవ్రంగా మండిపతున్నారట. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, టిఆర్ఎస్‌పై పోరుకు పార్టీ ఉమ్మడిగా కలిసి రావడంలేదని, సొంతంగా పోరాటానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలతో సంబంధం లేకుండానే వ్యక్తిగతంగా, గులాబీ సర్కారుకు వ్యతిరేకంగా నిరసనలకు ప్లాన్ చేస్తున్నారు. గస్తీబాట పేరుతో సొంత పార్లమెంటు నియోజికవర్గం మొత్తం పర్యటించారు. పార్టీలో ఎలాంటి చర్చ జరపకుండానే కార్యక్రమాన్ని సొంతంగా నిర్వహించుకున్నారు. ఆయన గాంధీభవన్ మెట్లు ఎక్కకుండానే సొంత ఆఫీస్ పెట్టుకుని అక్కడి నుంచే సకల కార్యక్రమాలూ చేస్తున్నారట. పార్టీ తనకు అండగా లేకపోతే, భవిష్యత్తులో రేవంత్‌ రెడ్డి సొంతపార్టీ పెట్టుకుంటారనే ప్రచారం జరుగుతోంది.

ఇక ముగుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి సైతం తమ బ్రదర్స్‌లో ఒకరికి పిసిసి పదవి ఇవ్వకుంటే సొంతపార్టీ పెట్టుకుంటానంటూ సిఎల్పీ సమావేశం అనంతరం బహిరంంగానే ప్రకటించడం సంచలనమైంది. టిఆర్ఎస్‌కి వ్యతిరేకంగా మాట్లాడే నేతలు పార్టీలో ఎవరూ ముందుకు రావడం లేదని రగిలిపోతున్నారట కోమటి రెడ్డి బ్రదర్స్. గతంలో కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డిపై అసెంబ్లీ బహిష్కరణ వేటు పడ్డా, పార్టీ తమకు మద్దతుగా నిలవలేదన్న విషయం మర్చిపోలేదంటున్నారు. కాంగ్రెస్ పార్టీగా టిఆర్ఎస్‌ను కట్టడి చేయడం సాధ్యం కాదన్న ఆలోచనకు వచ్చేశారట. అందుకే రాజగోపాల్ రెడ్డి సొంతపార్టీ పెట్టుకోవడానికి రెడీ అవుతున్నట్లు ఆయన ఫాలోవర్స్ చెప్పుకుంటున్నారు.

మొత్తానికి కాంగ్రెస్‌లో తమకెవరూ మద్దతుగా లేరనో, లేదంటే సమిష్టిగా పోరాటం చెయ్యడంలో పార్టీ విఫలమవుతోందనో కానీ, మొత్తానికి వ్యక్తిగత అజెండాతో సర్కారుపై పోరాటానికి సిద్దమవుతున్నారట రేవంత్‌ రెడ్డి, రాజగోపాల్‌ రెడ్డి. ఈ హంగామా మొత్తం, పీసీసీ రేసులో అధిష్టానం దృష్టిలో పడేందుకు, మార్కులు కొట్టేసేందుకేనని, సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి కారణం ఏదైనా, పార్టీతో సంబంధంలేకుండా, ప్రత్యామ్నాయ నాయకత్వం అనిపించుకునేందుకు రకరకాల ఎత్తులూ వేస్తున్నారట నేతలు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories