హైదరాబాద్ లో 'వింగ్స్‌ ఇండియా' సదస్సు

హైదరాబాద్ లో వింగ్స్‌ ఇండియా సదస్సు
x
వింగ్స్‌ ఇండియా సదస్సు
Highlights

రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకోసారి పౌర విమానయాన అంతర్జాతీయ ప్రదర్శన నిర్వహిస్తారు. ఈ నేపధ్యంలోనే ఈ ఏడాది కూడా ఈ ప్రదర్శన నిర్వహించనున్నారు.

రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకోసారి పౌర విమానయాన అంతర్జాతీయ ప్రదర్శన నిర్వహిస్తారు. ఈ నేపధ్యంలోనే ఈ ఏడాది కూడా ఈ ప్రదర్శన నిర్వహించనున్నారు. హైదరాబాద్ నగరంలోని బేగం పేట విమానాశ్రయంలో గురువారం నుంచి ప్రారంభం అయ్యే ఈ ప్రదర్శన నాలుగు రోజుల పాటు జరగనున్నాయి. ఇందుకు గాను ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసారు. ఈ కార్యక్రమాన్ని 'ఫ్లైయింగ్‌ ఫర్‌ ఆల్‌' ప్రధాన ఉద్దేశంతో 'వింగ్స్‌ ఇండియా 2020'ని నిర్వహిస్తున్నట్లు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ) తెలిపింది.

ఈ కార్యక్రమంలో భాగంగానే ఈనెల 12న బీ2బీ-బీ2జీ సమావేశాలు, ప్రదర్శన, ఎయిరోబాటిక్స్‌- ఎయిర్‌ షోలను నిర్వహిస్తున్నారు. 13న 'ఫ్లయింగ్‌ ఫర్‌ ఆల్‌' పేరిట ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ తరువాత 14వ తేదీన మంత్రివర్గ ప్లీనరీకి, ఇతర ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వ విమానయాన శాఖ మంత్రి హరిదీప్‌సింగ్‌ సమావేశం గురించి ప్రసంగించనున్నారు. విమానయానం, విమానాశ్రయాల రంగంలో వస్తున్న మార్పులు, భవిష్యత్‌ అంచనాలు మొదలైన వాటిపై సదస్సులో చర్చలు జరుగుతాయి. ఇక ఆఖరి రోజైన 15వ తేదీన విమానయాన ప్రదర్శన, ఎయిరోబాటిక్స్‌- ఎయిర్‌ షో జరుగనుంది.

ఇక ఈ సదస్సను ఫిక్కీ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కలిసి ఈ సదస్సు, ప్రదర్శనను నిర్వహిస్తున్నాయి.ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా తెలంగాణ పరిశ్రమల మంత్రి కేటీ రామారావు హాజరుకానున్నారు. ఆయనతో పాటు ఎయిర్‌పోర్ట్సు అథారిటీ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ అరవింద్‌ సింగ్‌, సివిల్‌ ఏవియేషన్‌ కమిటీ, భారత ప్రభుత్వం మోకా సంయుక్త కార్యదర్శి ఉషా పధీ, ఫిక్కీ చైర్మన్‌, ఎండీ ఎయిర్‌ బస్‌ ఇండియా ఆనంద్‌ స్టాన్లీ, మోకా కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ ఖరోలా హాజరు కానున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories