రేపటి నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు

రేపటి నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు
x
Intermediate exams
Highlights

తెలంగాణా రాష్ట్రంలో రేపటి (బుధవారం ) నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్‌ పరీక్షలకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని

తెలంగాణా రాష్ట్రంలో రేపటి (బుధవారం ) నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్‌ పరీక్షలకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు మొత్తం ఈ సంవత్సరంకి గాను 9.65 లక్షల మంది ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాయనున్నారు. అందులో ఫస్టియర్‌ 4,80,531, సెకండ్‌ ఇయర్‌ 4,85,345 విద్యార్దులు హాజరు కానున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశామని బోర్డు అధికారులు వెల్లడించారు.

ఇప్పటికే పరీక్షలకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, నిమిషం ఆలస్యమైనా అనుమతి ఇచ్చేది లేదని అధికారులు వెల్లడించారు. విద్యార్థులు నేరుగా హాల్‌టికెట్లు ఇంటర్‌బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోచ్చు. అంతేకాకుండా పరీక్ష కేంద్రాలను తెలుసుకోవడానికి సెంటర్‌ లొకేటర్‌ యాప్‌ను కూడా రూపొందించారు. ఈ యాప్‌లో సెంటర్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయగానే జిపిఎస్‌ విధానం ద్వారా చిరునామా, సెంటర్‌ వివరాలు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి, సెంటర్‌ ఎలా వెళ్ళాలో కూడా గుగూల్‌ మాప్‌సూచిస్తుంది.

ఇక పరీక్షల్లో మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను నిషేదించింది ఇంటర్‌బోర్డు.. పరీక్ష కేంద్రాలన్నింటిల్లోనూ సిసి కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఇక పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే 0866-2974130, టోల్‌ ఫ్రీ నెంబర్‌ 18002749868 ఫిర్యాదు చేయవచ్చునని వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఈ నెంబర్లు అందుబాటులో ఉంటాయని అంతేకాకుండా వాట్సాప్‌ చేసేందుకు 9391282578 నెంబర్‌ ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories