బస్సు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

బస్సు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
x
Highlights

10 రోజులుగా తెలంగాణా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు వారి హక్కుల కోసం నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులు వారి గమ్య స్థానాలకు చేరుకోవడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ప్రయివేటు బస్సులను, అనుభవం లేని డ్రైవర్లను పెట్టి నడిపిస్తుంది.

10 రోజులుగా తెలంగాణా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు వారి హక్కుల కోసం నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులు వారి గమ్య స్థానాలకు చేరుకోవడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ప్రయివేటు బస్సులను, అనుభవం లేని డ్రైవర్లను పెట్టి నడిపిస్తుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న భద్రాద్రి కొతగూడెంలో బస్సు బ్రేక్ ఫెయిలై భీభత్సం సృష్టిస్తే, ఆ సంఘటన మరువకముందే మరో బస్సు వెనక టైర్ ఊడిపోయి ప్రమాదం చోటుచేసుంది. ఇలాంటి ఒక సంఘటన నల్గొండలోనూ చోటు చేసుకుంది. అద్దె బస్సు డ్రైవర్‌ నిర్వాకం వలన ఓ ప్రయాణికుడి కాలు విరిగింది.

ఈ సంఘటన నల్లగొండ జిల్లా హాలియా బస్టాండ్‌లో చోటుచేసుకుంది. అనుముల మండలానికి చెందిన చంద్రకాంత్ హాలియా బస్టాండ్‌కు చేరుకుని బస్సు దిగుతున్నాడు. అదే సమయంలో డ్రైవర్‌ గమనించకుండా ఆ బస్సును నడుపుకుంటూ ముందుకు పోనించాడు. దీంతో బస్సు వెనక చక్రాలు అతని కాలుపై నుంచి వెళ్లాయి. ఈ ప్రమాదంలో అతని కాలికి తీవ్ర గాయాలయ్యాయి. అది గమనించిన తోటి ప్రయాణికులు అంబులెన్స్‌కి ఫోన్‌ చేసి క్షతగాత్రున్ని వెంటనే స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనుభవం లేని డ్రైవర్‌ చూసుకోకుండా బస్సును నిర్లక్షంగా నడిపినందుకే ఈ ప్రమాదం జరిగిందని తోటి ప్రయాణికులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories