నగరవాసులకు అందుబాటులో ఇన్‌డ్రైవర్ సేవలు

నగరవాసులకు అందుబాటులో ఇన్‌డ్రైవర్ సేవలు
x
Highlights

హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త. గత రెండు నెలల నుంచి లాక్ డౌన్ కారణంగా నిలిపి వేసిన ప్రముఖ ట్యాక్సి సర్వీస్ యాప్ ఇన్‌డ్రైవర్ కార్యకలాపాలను పునరుద్దరించారు.

హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త. గత రెండు నెలల నుంచి లాక్ డౌన్ కారణంగా నిలిపి వేసిన ప్రముఖ ట్యాక్సి సర్వీస్ యాప్ ఇన్‌డ్రైవర్ కార్యకలాపాలను పునరుద్దరించారు. దీంతో ఇన్ డ్రైవ్ సేవలను పొందాలనుకునే వినియోగదారులు ఈ రోజు నుంచి తమ రైడ్స్‌ను బుక్ చేసుకోవచ్చని ఆ సంస్థ ప్రకటించింది. అంతే కాక ప్రస్తుతం ఉపాధి లేకుండా ఖాళీగా ఉంటున్న వాహనదారులు కూడా ఇన్‌డ్రైవర్‌తో ఆదాయం పొందాలనుకుంటే వారు కూడా తమ సేవలను కొనసాగించవచ్చని తెలిపింది.

ఈ సందర్భంగా ఇన్‌డ్రైవర్ ఇండియా పీఆర్ అండ్ కమ్యూనికేషన్స్ మేనేజర్ పవిత్ నంద మాట్లాడుతూ లాక్ డౌన్ నేపథ్యంలో రెండు నెలల పాటు సేవలను నిలిపివేశామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గకపోయినప్పటికీ తమ వినియోగదారుల కోసం సేవలను తిరిగి ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రజలంతా తప్పని సరిగా కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. డ్రైవర్లు , ప్రయాణీకుల భద్రత చాలా ముఖ్యమని అన్నారు.

ఇక ఇన్ డ్రైవర్ సేవలను పొందే వినియోగదారులు బుక్ చేసుకునే ముందు, ఆ తరువాత హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడంతో పాటు, మాస్కు ధరించి మాత్రమే వాహనం ఎక్కాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా ఓ క్యాబ్‌లో డ్రైవర్‌తో సహా ఇద్దరు ప్రయాణీకులకు మాత్రమే అనుమతిస్తామన్నారు. ప్రయాణికులు కారు వెనుక సీట్లో మాత్రమే కూర్చోవాలన్నారు. అంతే కాదు ప్రయాణీకులు తీసుకువచ్చే లగేజీని తామే కారులో పెట్టుకోవాలని సూచించారు.

ఇక ఈ ఇన్ డ్రైవ్ యాప్ లో తమ గమ్యస్థానం చేరడానికి పట్టే సమయం, డ్రైవర్ రేటింగ్, తాము చెల్లించాలనుకున్న మొత్తం పూర్తి వివరాలను పరిగణలోకి తీసుకుని ప్రయాణీకులు తమ రైడ్స్‌ను ఎంచుకునే అవకాశం ఈ యాప్‌లో ఉందన్నారు.


హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories