ముప్పయి తొమ్మిది ఏళ్ల నెత్తుటి మరక

ముప్పయి తొమ్మిది ఏళ్ల నెత్తుటి మరక
x
Highlights

ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇంద్రవెల్లి పేరు వింటేచాలు అందరికీ గుర్తొచ్చేది ఒక్కటే ఆదివాసీలు తమ హక్కుల కోసం చేసిన పోరాటం. జల్‌, జమీన్‌, జంగిల్‌ నినాదంతో ఐక్యమైన ఆదివాసీలు సరిగ్గా 39 ఏళ్లక్రితం ఇదే రోజున వందమందికి పైగా అడవిబిడ్డలు పోలీసుల తూటాలకు బలైపోయారు.

ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇంద్రవెల్లి పేరు వింటేచాలు అందరికీ గుర్తొచ్చేది ఒక్కటే ఆదివాసీలు తమ హక్కుల కోసం చేసిన పోరాటం. జల్‌, జమీన్‌, జంగిల్‌ నినాదంతో ఐక్యమైన ఆదివాసీలు సరిగ్గా 39 ఏళ్లక్రితం ఇదే రోజున వందమందికి పైగా అడవిబిడ్డలు పోలీసుల తూటాలకు బలైపోయారు.అందుకే ఈ రోజును గుర్తు చేస్తే ఆదివాసీ ప్రజలు, గిరిజనుల్లో సమరోత్సాహం కలుగుతుంది.

1981వ సంవత్సరం ఏప్రిల్‌ 20న జల్‌ - జంగిల్‌ - జమీన్‌ అనే నినాదంతో అడవి బిడ్డలు ఇంద్రవెల్లిలో సభను నిర్వహించారు. అటవీభూములపై తమకు హక్కుల కల్పించాలనే ఎజెండాతో ఆదివాసీలు సభ నిర్వహించారు. ఈ సభకు ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది అడవిబిడ్డలు, ఆదివాసీలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసులు గిరిపుత్రులపై దాడికి దిగారు. మహిళలపై నిర్ధాక్షిన్నంగా చేయిచేసున్నారు దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థతిని గమనించిన ఆర్డీవో కాల్పులు జరపాలంటూ అనుమతులు జారీ చేసారు.

వెంటనే పోలీసులు ఆదివాసీలు, గిరిజనులపై కాల్పులు జరిపి వందమందికి పైగా గిరిపుత్రులను పొట్టనపెట్టుకున్నారు. ఆ ప్రాంతంగా ఆదివాసీ అమరవీరుల నెత్తుటితో తడిసి ఎర్రబడింది. మరికొంత మంది ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనలో 113మంది చనిపోయినప్పటికీ అప్పటి ప్రభుత్వం కేవలం 13 మంది మాత్రమే చనిపోయారని లెక్కలు వేసింది.

ఆ తరువాత ఏడాది అంటే 1982లో పీపుల్స్‌ వార్‌ రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో అమరుల జ్ఞాపకార్థం స్థూపాన్ని నిర్మించారు. అప్పటినుంచి ప్రతి ఏడాది అమల వీరుల సంస్మరణ సభ నిర్వహించి శ్రద్దాంజలి ఘటించేవారు. కానీ 1986 సంవత్సరంలో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు అమరవీరుల స్థూపాన్ని డిటోనేటర్లతో పేల్చివేసారు. ఈ తరువాత మూడేళ్లకు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం గిరిజన అభివృద్ధి సంస్థ నిధులతో ఆ స్థూపాన్ని మళ్లీ నిర్మించింది. అయినా ప్రభుత్వం ఆ స్థూపం వద్ద సంస్మరణ సభ నిర్వహించే అనుమతిని 1989లో నిరాకరించింది.

అయినా ప్రతి సంవత్సరం గిరిపుత్రులు పోలీసుల నిర్బంధాన్ని అడ్డుకుంటూ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన నివాళులు అర్పిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎలాంటి ఆంక్షలు లేకుండా గిరిజనులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అమర వీరుల స్థూపం వద్ద చేరుకుని వారికి ఘనంగా నివాళులర్పించుకుంటున్నారు. కానీ ఈ ఏడాది ఆ అవకాశం లేదు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించేందుకు ఐదుగురు గిరిజన పెద్దలకు మాత్రమే అనుమతి ఇచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories