అక్కడబ్బాయి.. ఇక్కడమ్మాయి..

అక్కడబ్బాయి.. ఇక్కడమ్మాయి..
x
Highlights

ప్రేమకు కులం, మతంతో సంబంధం లేదు. ప్రాంతాల వ్యత్యాసం అనేవి అసలే ఉండదు. రెండు మనసులు ఒకటై ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటే చాలు. అది ప్రేమగా మారుతుంది. ఆ...

ప్రేమకు కులం, మతంతో సంబంధం లేదు. ప్రాంతాల వ్యత్యాసం అనేవి అసలే ఉండదు. రెండు మనసులు ఒకటై ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటే చాలు. అది ప్రేమగా మారుతుంది. ఆ ప్రేమను రెండు కుటుంబాలు ఒప్పుకుంటే చాలు ప్రేమబంధం వివాహ బంధంగా మారుతుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయి అమెరికా అబ్బాయితో ప్రేమలో పడింది. రెండు కుటుంబాలు పెళ్లికి ఓకే చెప్పడంతో పెళ్లితో ఒకటయ్యారు.

నిజామాబాద్‌కు చెందిన సామలేటి అర్చన కొన్నేళ్ల కిందట ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. చదువు పూర్తయ్యాక అక్కడే ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అదే కంపెనీలో పని చేస్తున్న శాన్ విన్ డ్యాగ్ అనే అమెరికా పౌరుడిని ఇష్టపడింది. ఇద్దరివీ వేర్వేరు వేరు దేశాలు, రెండు కమ్యూనిటీలకు చెందిన వారు అయినా వారి ప్రేమను పెద్దలు ఒప్పుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం వారి పెళ్లి జరిపించి పెద్దరికాన్ని చాటుకున్నారు. వివాహ వేడుకల్లో అబ్బాయి తల్లిదండ్రులు భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా వస్త్రాలు ధరించడం ఆ వేడుకకే హైలైట్ గా నిలిచింది. అంతకుముందు అమెరికాలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories