ఆకాశాన్నంటుతున్న గుడ్ల ధరలు

ఆకాశాన్నంటుతున్న గుడ్ల ధరలు
x
Highlights

గత కొన్ని రోజులుగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. మార్కెట్ లో దొరికే కూరగాయల ధరల దగ్గర నుంచి కిరాణాదుకాణాల్లో దొరికే నిత్యావసరాల ధరల వరకు ఆకాశాన్నంటుతున్నాయి.

గత కొన్ని రోజులుగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. మార్కెట్ లో దొరికే కూరగాయల ధరల దగ్గర నుంచి కిరాణాదుకాణాల్లో దొరికే నిత్యావసరాల ధరల వరకు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే దేశంలో ఉల్లి ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తరువాత మార్కెట్లో దొరికే కూరగాయల ధరలు కూడా మిన్నంటాయి. దీంతో సాధారణ ప్రజలు మార్కెట్ కి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఒకప్పటి కాలంలో రూ.100 తీసుకెళ్తే చాలు వారానికి సరిపడ కూరగాయలు వచ్చేవి. అలాంటిది ప్రస్తుతం రూ.1000 తీసుకెళ్లినా సగం సంచి కూడా నిండడంలేదు. అంటే ఎంత మోదాదులో ధరలు మండిపోతున్నాయో అర్థం అవుతుంది.

ఇదే కోణంలో ఇప్పుడు కోడిగుడ్ల ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు కూరలు వండాలనుకుంటే కోడిగుడ్లను వాడతారు. అంతే కాక గుడ్లను తినడం వలన పౌష్టికాహారం లభించడంతో గుడ్లను ఎక్కువగా వాడతారు. కొంత మంది తమ కురుల సౌందర్యం కోసం కూడా వాడతారు. దీంతో గ్రామాల్లో, నగరాల్లో గుడ్ల వాడకం పెరిగిపోయింది. అంతే కాక రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడంతో దిగుబడి కూడా చాలా మేరకు తగ్గిపోయింది. దీంతో విక్రయదారులు గుడ్ల ధరను పెంచారు. సాధారణ రోజుల్లో జంట నగరాల్లో రోజుకు సుమారు 45 లక్షల గుడ్ల అమ్మకాలు జరుగుతుంటాయి.

కానీ కూరగాయల ధరలు పెరిగిపోవడంతో గతవారం నుంచి రోజుకు 60 లక్షలకు పైగా గుడ్లు అమ్ముడవుతున్నాయని, వినియోగదారులు గుడ్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండి, సప్లై తక్కువగా ఉండడంతో గుడ్డు ధర కూడా రికార్డు స్థాయిలో పైగిసిందంటున్నారు వ్యాపారులు, వినియోగదారులు. ప్రస్తుతం హోల్‌సేల్‌ మార్కెట్‌లో ఒక గుడ్డు ధర రూ.5.50 ఉంటే, రిటైల్‌ మార్కెట్‌లో రూ.6గా ఉంది. ఇక్కడే ఈ విధంగా ఉంటే నగర శివారు ప్రాంతాల్లో గుడ్డుకు రూ.6.50 పైసల నుంచి రూ.7 వరకు ధర పలుకుతుంది. దీంతో వినియోగదారులు గుడ్డు కొనాలంటేనే ఆలోచిస్తున్నారు.

ఇక పోతే దేశ వ్యాప్తంగా చూసుకుంటే గుడ్లను ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ముందంజలో ఉండగా తెలంగాణ రాష్ట్రం మూడోస్థానంలో ఉంది. కానీ వినియోగంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రమే ముందంజలో ఉంది. రాష్ట్రంలో రోజుకు 3.25 కోట్ల గుడ్ల ఉత్పత్తి కాగా వాటిలో 60 శాతం గుడ్లు మన రాష్ట్రంలోనే వినియోగిస్తున్నారు.

HMTV లైవ్ నుంచి తాజా వార్తా విశేషాల కోసం TELEGRAM ను అనుసరించండి!


Show Full Article
Print Article
More On
Next Story
More Stories