సిద్దిపేటలో పంజావిసురుతున్న కరోనా..మంత్రి పీఏ సహా 11 మందికి పాజిటివ్

సిద్దిపేటలో పంజావిసురుతున్న కరోనా..మంత్రి పీఏ సహా 11 మందికి పాజిటివ్
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రశాంతంగా ఉన్న జిల్లాల్లో కలకలం రేపుతుంది. మొన్నటి వరకు అసలు కేసులే లేని జిల్లాల్లో ఒక్కసారిగా పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రశాంతంగా ఉన్న జిల్లాల్లో కలకలం రేపుతుంది. మొన్నటి వరకు అసలు కేసులే లేని జిల్లాల్లో ఒక్కసారిగా పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో సిద్దిపేట జిల్లా కూడా చేరింది. చాలా రోజుల వరకు సురక్షితంగా ఉన్న జిల్లాలో మంత్రి పీఏ సహా 11 మంది కోవిడ్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.

లాక్ డైన్ నిర్వహిస్తున్న సమయంలో చాలా రోజుల పాటు కరోనా కేసులు నమోదు కాని సిద్ధిపేట జిల్లాలో వైరస్ విజృంభిస్తోంది. సిద్దిపేటలో తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి మంత్రి హరీశ్ రావు పీఏ తో పాటు మరో 11 మంది కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయం తెలియగానే మంత్రి హరీశ్ రావు స్వీయ నిర్బంధంలో వెళ్లిపోయారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వారి నుంచి తమకు కూడా వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందనే అనుమానంతో శుక్రవారం 34 మంది శాంపిళ్లను అందజేశారు. హైదరాబాద్ నుంచి రాకపోకలు పెరగడం, వేరే జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు తిరిగొస్తుండటంతో జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఈ మధ్య కాలంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఏర్పాటు చేసిన ఓ సమావేశానికి హాజరైన వారిలో ఓ వ్యక్తికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో జిల్లా కలెక్టర్ కూడా స్వీయ నిర్బంధంలో వెళ్లారు. ప్రస్తుతం ఆయన పనులను ఇంటి నుంచే చక్కబెడుతున్నారు. ప్రతిక్షణం ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాలను తెలుసుకుంటున్న నాయకులకు, అధికారులకు కరోనాకు గురవుతున్న నేపథ్యంలో సిద్ధిపేట వాసులు భయపడుతున్నారు. మంత్రి హరీశ్‌ రావు వ్యక్తిగత సహాయకుడికి కరోనా సోకడంతో సిద్దిపేట పట్టణంలోని శ్రీనగర్‌ కాలనీ, శివాజీ నగర్‌ ప్రాంతాల్లో వైద్యారోగ్య శాఖ సిబ్బంది శుక్రవారం సర్వే నిర్వహించారు. సోడియం హైడ్రోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేశారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories