అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను.. భార్య నడిరోడ్డుపై..

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను.. భార్య నడిరోడ్డుపై..
x
Highlights

నాగర్‌ కర్నూలులోని అంబేడ్కర్‌ చౌరస్తాలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు...

నాగర్‌ కర్నూలులోని అంబేడ్కర్‌ చౌరస్తాలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు భార్య ప్రయత్నించింది. గల్లా పట్టుకుని తనకు న్యాయం చేయాలని నిలదీసింది. అచ్చంపేటకు చెందిన వరలక్ష్మికి ఏడేళ్ల క్రితం యుగంధర్‌ గౌడ్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే కుటుంబంలో వివాదాలు రావడంతో విడాకుల కోసం కోర్టుకెక్కారు. తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసిన భార్య.. అతన్ని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవాల్ని ప్రయత్నించింది. అయితే పోలీసుల సహాయంతో విషయం తెలుసుకున్న భర్త పరారయ్యేందుకు ప్రయత్నించగా అతన్ని అడ్డుకున్న భార్య సహచరులతో కలిసి దేహశుద్ది చేసింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories