టీఆర్ఎస్ లో చేరడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే స్పందన

టీఆర్ఎస్ లో చేరడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే స్పందన
x
Highlights

తెలంగాణలో అధికార టీఆరెస్ లోకి వలసలు జోరందుకున్న సంగతి ఎన్నికలు ముగిసిన నాటినుంచి చూస్తున్నాం. ఈ క్రమంలో విపక్షం కాంగ్రెస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు...

తెలంగాణలో అధికార టీఆరెస్ లోకి వలసలు జోరందుకున్న సంగతి ఎన్నికలు ముగిసిన నాటినుంచి చూస్తున్నాం. ఈ క్రమంలో విపక్షం కాంగ్రెస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా కారెక్కేందుకు సిద్దమయ్యారంటూ రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కూడా టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి స్పందించారు.

తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వాటిలో వాస్తవం లేదని, అవి పూర్తిగా అబద్ధమని తేల్చారు. అలాగే తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరనున్నారని టీఆర్‌ఎస్ మైండ్‌గేమ్ ఆడుతోందని ఈ సందర్బంగా సుధీర్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై దుష్ప్రచారాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories