logo

హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కాబోతోంది..మాజీ ఎంపీ సంచలన కామెంట్స్..

హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కాబోతోంది..మాజీ ఎంపీ సంచలన కామెంట్స్..
Highlights

మహారాష్ట్ర ఎన్నికల తర్వాత హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా మారుతుందంటూ కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన...

మహారాష్ట్ర ఎన్నికల తర్వాత హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా మారుతుందంటూ కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ రాజధాని అమరావతి అచ్చిరాని ప్రాంతమని, జగన్ సీఎంగా ఉన్నంత కాలం సెంటిమెంట్ పరంగా సక్సెస్ కాలేరంటూ మరో బాంబు పేల్చారు చింతామోహన్. కశ్మీర్ లో 370 రద్దు తర్వాత పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నామని, హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చితే మళ్లీ అలజడి రేగే అవకాశముందన్నారు. సీమ ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే ప్రధాని మోడీ ఇతర దేశాలకు దాన ధర్మాలుచేయడం విచిత్రంగా ఉందంటూ చింతా మోహన్ మండి పడ్డారు.


లైవ్ టీవి


Share it
Top