ఆటోమేటెడ్‌ శానిటైజేషన్‌ డిస్పెన్సర్‌ తయారి...

ఆటోమేటెడ్‌ శానిటైజేషన్‌ డిస్పెన్సర్‌ తయారి...
x
Highlights

రెండు మూడు నెలల క్రితం వరకు మాస్క్ లను, శానిటైజర్‌ లను కేవలం ఆస్పత్రుల్లోనే ఎక్కువగా ఉపయోగిస్తుండే వారు.

రెండు మూడు నెలల క్రితం వరకు మాస్క్ లను, శానిటైజర్‌ లను కేవలం ఆస్పత్రుల్లోనే ఎక్కువగా ఉపయోగిస్తుండే వారు. బయట ఎవరూ కూడా వీటిని వాడేవారే కాదు. కానీ ఒక్క సారిగా కరోనా వైరస్ విజృంభించడంతో వాటి వాడకం ఎక్కువైపోయింది. ఎవరిని చూసినా మాస్కులు ధరించడం, శానిటైజర్లను వాడుతున్నారు. అవి లేకుండా ఇళ్లలోంచి బయటకు కూడా వెళ్లడం లేదు. కరోనాను అడ్డుకునేందుకుఏకమైన మార్గం ఫిజికల్‌ డిస్టెన్స్‌ – హ్యాండ్‌ శానిటైజేషన్‌ మాత్రమే. ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒకరు తాకిన వస్తువును మరోకరు తాకడం, ఒకరు తిరిగిన ప్రదేశంలో తిరగడం లాంటి తెలియకుండానే చేస్తుంటాం.

అంతే కాదు అతి ముఖ్యమైన జాగ్రత్తల్లో మనం చెప్పుకుంటున్న హ్యాండ్‌ శానిటైజర్ల వినియోగం సందర్భంలోనే మన చేతులతో హ్యాండ్‌ శానిటైజర్‌ పంపును తాకడమో లేక మరోవ్యక్తి దాన్ని చేతులకు అందించే క్రమంలోమన దగ్గరకు రావడమో జరుగుతోంది. దీంతో కూడా ప్రైమరి కాంటాక్ట్ ద్వారా కరోనా వైరస్ సోకుతుంది. అయితే ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొని ఓ యువ ఇంజనీర్ ఒక కొత్త మిషన్ ను తయారు చేసాడు. ఇప్పటి వరకు మార్కెట్‌లో అందుబాటులోలేని పూర్తి ఆటోమేటెడ్‌ శానిటైజేషన్‌ డిస్పెన్సర్‌ను రూపొందించాడు. నగరంలోని సాగర్‌రోడ్డు గుర్రంగూడకు చెందిన మెకానికల్‌ ఇంజినీర్‌ రాయంచి అభినవ్‌ కుమార్‌ ఈ పరికరాన్ని కనుగొన్నాడు.


ముందుగా తన ఇంట్లో ఉన్న పాత ఆయిల్‌ క్యాన్‌తో అభినవ్ ఈ ప్రయోగాన్ని మొదలు పెట్టారు. ఎన్నో సార్లు దీన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించారు. అందులో భాగంగా పలు రకాల నీటి పంప్‌లను, సబ్‌మెర్సిబుల్‌ పంప్‌లను వినియోగించాడు. అయిన ఫలితం దక్కకపోవడంతో ఆఖరికి ఫుడ్‌గ్రేడ్‌ డీసీ పంప్, ఇండస్ట్రీయల్‌ గ్రేడ్‌ సెన్సార్, ఇతర పరికరాలను ఉపయోగించి విజయవంతంగా రూపొందించాడు. ఈ పరికరంలో ప్రధానమైన హార్డ్‌వేర్‌ డిజైన్‌ను రూపొందించేందుకు 25 రోజుల సమయం పట్టింది. వినాగో ఇన్నోవేషన్‌ బ్రాండ్‌ పేరిట 'శాని–సెన్స్‌' పేరుతో ఈ కాంటాక్ట్‌ లెస్‌ హ్యాండ్‌ శానిటైజర్‌ డిస్పెన్సరీని కేవలం రూ.6 వేలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.

అయితే దీని ద్వారా శానిటైజర్ బాటిల్లను చేతులతో తాకకుండానే వాడుకోవచ్చు. అది ఎలాగంటే డిస్పెన్సర్‌కు దగ్గరగా చేతులను తీసుకెళ్లినప్పుడు ఆటోమెటిక్‌గా అది 4 ఎంఎల్‌ హ్యాండ్‌ శానిటైజర్‌ ను చేతుల్లో వేస్తుంది. ఇది విద్యుత్‌ సహాయంతో పనిచేసే ఉపకరణం. దీని వాడడం ద్వారా నెలకు కేవలం ఒక యూనిట్‌ విద్యుత్‌ మాత్రమే ఖర్చవుతుంది. పెద్ద కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు, అధిక సంఖ్యలో సిబ్బంది ఉండే కార్యాలయాలు, షాపింగ్‌ మాల్స్, ఫంక్షన్లు, పార్టీలు ఇలా ఎక్కువ జనాభా ఉండే చోట్ల ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. పది లీటర్ల కెపాసిటీ కలిగిన ఈ డిస్పెన్సరీని ఒక్కసారి ఫిల్‌ చేస్తే దాదాపు రెండు వేలసార్లు లిక్విడ్‌ను వాడవచ్చు. ఇందులో జెల్‌ బేస్డ్‌ శానిటైజర్‌తో పాటు లిక్విడ్‌ బేస్డ్‌ శానిటైజర్‌ను కూడా వేసి ఉపయోగించవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories