అంతర్జాతీయ అవార్డు అందుకున్న హైదరాబాద్‌ షార్ట్‌ఫిల్మ్‌

అంతర్జాతీయ అవార్డు అందుకున్న హైదరాబాద్‌ షార్ట్‌ఫిల్మ్‌
x
Highlights

మనుషులు తమ జీవనానికి ఉపయోగపడే చెరువులు, పర్యావరణం, వాతావరణ సమతుల్యతలను ఎలా దెబ్బ తీస్తున్నారనే అనే అంశంపై ప్రజలందరి గుండెలకు హత్తుకునే విధంగా చెరువుల పరిరక్షణ కమిటీ సభ్యుడు సునీల్‌ సత్యవోలు ఓ షార్ట్ ఫిలింను నిర్మించారు.

మనుషులు తమ జీవనానికి ఉపయోగపడే చెరువులు, పర్యావరణం, వాతావరణ సమతుల్యతలను ఎలా దెబ్బ తీస్తున్నారనే అనే అంశంపై ప్రజలందరి గుండెలకు హత్తుకునే విధంగా చెరువుల పరిరక్షణ కమిటీ సభ్యుడు సునీల్‌ సత్యవోలు ఓ షార్ట్ ఫిలింను నిర్మించారు. దానికి అన్షుల్‌ దర్శకత్వం వహించారు. ఈ ఇతి వృత్తంలో మణికొండ మున్సిపాలిటీ నెక్నాంపూర్‌ పెద్ద చెరువు వద్ద నిర్మించిన ఈ షార్ట్ ఫిలింనకు అంతర్జాతీయ షార్ట్‌ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అంతర్జాతీయ అవార్డు దక్కింది. వీరిద్దరి కాంబినేషన్ లో రెండున్నర నిమిషాల పాటు ఉన్న ఈ లఘుచిత్రంలో ఓ చెరువు పదేళ్ల మూగ బాలికకు చెరువుల పరిరక్షణ గురించి వాటి కష్టాలను గురించి చెప్పుకుంటుందని తెలిపారు. దాంతో ఆ బాలిక చెరువును ఊరడిస్తుందని తెలిపారు. ఇందుకే ఈ చిత్రానికి 'సైలెంట్‌ వాయిస్‌' అనే పేరు పెట్టామని నిర్మాత తెలిపారు.

ఈ అవార్డును అమెరికాలోని న్యూయార్క్ నిర్వహించిన లంప ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌ లో చైర్‌పర్సన్‌ ఓల్గా జుబ్కొవా, యునైటెడ్‌ నేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్, సోషల్‌ అఫైర్స్‌ సెక్రటరీ జనరల్‌ లియూ జెన్‌మిన్, రష్యా మొదటి డిప్యూటీ శాశ్వత ప్రతినిధి డ్మిట్రై పోల్యానస్కై చేతుల మీదుగా అవార్డును అందుకున్నట్టు నిర్మాత సునీల్‌ వివరించారు. కమిషన్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ప్రతి ఏటా ఇలాంటి షార్ట్‌ఫిల్మ్‌ పోటీలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ షార్ట్ ఫిలిం ఇతర లఘుచిత్రాల కన్నా అధికంగా 17 గోల్స్‌ సాధించిందని తెలిపారు. ఇందుకే ఈ చిత్రానికి ప్రథమ బహుమతి దక్కిందని, ఇందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన వివరించారు. అంతే కాదు గతేడాది కూడా డిసెంబర్‌లో హైదరాబాద్‌ ఫోయనెక్స్‌ అరేనాలో నిర్వహించిన జాతీయ షార్ట్‌ఫిల్మ్‌ విభాగంలో కూడా ఈ చిత్రం మొదటి స్థానాన్ని దక్కించుకుందని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories